డబ్ల్యూపీఎల్‌లోకి సీఎస్కే?.. హింట్ ఇచ్చిన సీఎస్కే సీఈవో

by Harish |

డబ్ల్యూపీఎల్‌లోకి సీఎస్కే?.. హింట్ ఇచ్చిన సీఎస్కే సీఈవో
X

దిశ, స్పోర్ట్స్ : ఐపీఎల్‌లో మోస్ట్ సక్సెస్‌ఫుల్ ఫ్రాంచైజీ చెన్నయ్ సూపర్ కింగ్స్(సీఎస్కే). ఆ జట్టు ఆరుసార్లు టైటిల్ గెలిచింది. సీఎస్కే సౌతాఫ్రికాలో జరిగే ఎస్‌ఏటీ20 లీగ్, అమెరికాలో జరిగే మేజర్ లీగ్ క్రికెట్‌‌లో కూడా తమ ఫ్రాంచైజీని విస్తరించింది. మహిళల క్రికెట్‌లోకి కూడా ఫ్రాంచైజీని విస్తరించాలని సీఎస్కే భావిస్తుంది. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్)పై ఫ్రాంచైజీ దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది.

సీఎస్కే సీఈవో కాశీ విశ్వనాథన్ కూడా హింట్ ఇచ్చారు. ‘వెంటనే కాదు. కానీ రాబోయే సంవత్సరాల్లో సీఎస్కే విస్తరిస్తుంది. మా ఫస్ట్ టార్గెట్ ఉమెన్స్ క్రికెట్. ఇతర క్రీడల్లోకి కూడా వెళ్తాం.’అని తెలిపారు. ఐపీఎల్ ఫ్రాంచైజీలైన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ డబ్ల్యూపీఎల్‌లో కూడా కొనసాగుతున్న విషయం తెలిసిందే. 2023‌లో ప్రారంభమైన డబ్ల్యూపీఎల్‌ సీజన్ సీజన్‌కు ఆదరణను పెంచుకుంటోంది. ప్రస్తుతం ఐదు జట్లు ఉండగా.. టోర్నీని విస్తరించాలని బీసీసీఐ ఆలోచిస్తున్నట్టు కథనాలు వస్తున్నాయి. బీసీసీఐ కొత్తగా ఒక్కటి లేదా రెండు ఫ్రాంచైజీలను చేర్చాలని పరిశీలిస్తుందని ఢిల్లీ క్యాపిటల్స్ సహ యజమాని పార్థ్ జిందాల్ తెలిపారు.

Next Story