- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సీఎస్కేపై అశ్విన్ సంచలన ఆరోపణలు.. స్పందించిన ఫ్రాంచైజీ
సౌతాఫ్రికా యువ బ్యాటర్ డెవాల్డ్ బ్రెవిస్ రిప్లేస్‌మెంట్ రూల్స్‌కు లోబడే జరిగిందని చెన్నయ్ సూపర్ కింగ్స్(సీఎస్కే) స్పష్టం చేసింది.

దిశ, స్పోర్ట్స్ : సౌతాఫ్రికా యువ బ్యాటర్ డెవాల్డ్ బ్రెవిస్ రిప్లేస్‌మెంట్ రూల్స్‌కు లోబడే జరిగిందని చెన్నయ్ సూపర్ కింగ్స్(సీఎస్కే) స్పష్టం చేసింది. ఎలాంటి నిబంధనలను అతిక్రమించలేదని తెలిపింది. బ్రెవిస్ రిప్లేస్‌మెంట్‌పై సీఎస్కేకే చెందిన స్పిన్నర్ ఆర్. అశ్విన్ సంచలన వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో సీఎస్కే వివరణ ఇచ్చింది. అసలేం జరిగిందంటే.. ఐపీఎల్-2025 సీజన్‌ముందు జరిగిన మెగా వేలంలో యువ పేసర్ గుర్జప్నీత్ సింగ్‌ను చెన్నయ్ రూ. 2.2 కోట్లకు తీసుకుంది. అయితే, అతను గాయం కారణంగా లీగ్‌కు దూరం కావడంతో అతని స్థానాన్ని డెవాల్డ్ బ్రెవిస్‌ను భర్తీ చేసింది.
ఐపీఎల్ రిప్లేస్‌మెంట్ రూల్ ప్రకారం.. లీగ్‌కు దూరమైన ఆటగాడి ధరతోనే ప్రత్నామ్నాయ ప్లేయర్‌ను తీసుకోవాలి. దీంతో బ్రెవిస్‌ను సీఎస్కే రూ. 2.2 కోట్లకే తీసుకుంది. తాజాగా అశ్విన్ బ్రెవిస్ రిప్లేస్‌మెంట్‌పై సంచలన వ్యాఖ్యలు చేశాడు. నిబంధనలకు విరుద్ధంగా బ్రెవిస్ రిప్లేస్‌మెంట్ జరిగిందన్నాడు. అతని కోసం పోటీ ఎక్కువగా ఉండటంతో రూ.2.2 కోట్ల కంటే సీఎస్కే అధిక మొత్తంలో డబ్బులు చెల్లించిందని వ్యాఖ్యానించాడు. సీఎస్కే ప్లేయరే బ్రెవిస్ భర్తీ అక్రమంగా జరిగిందని వెల్లడించడంతో ఆ విషయం చర్చనీయాంశంగా మారింది. ఐపీఎల్-2025లో ఆకట్టుకున్న బ్రెవిస్ ఆరు మ్యాచ్‌ల్లో 225 పరుగులు చేశాడు. అందులో రెండు హాఫ్ సెంచరీలు ఉన్నాయి.






