- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఐపీఎల్ 2026 కోసం చెన్నై భారీ స్కెచ్...ఈ ప్లేయర్లకు చెక్ !
వచ్చే సీజన్ లో కుర్ర క్రికెటర్లకు అవకాశం ఇవ్వాలని ధోని ప్లాన్ చేస్తున్నారట. ఇందులో భాగంగానే ఏకంగా సీనియర్ ప్లేయర్లు

దిశ, వెబ్ డెస్క్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ కు సంబంధించిన కీలక అప్డేట్ తాజాగా వచ్చింది. ఈ టోర్నమెంట్ కు సంబంధించిన వేలం డిసెంబర్ 13 నుంచి 15వ తేదీలలో జరిగే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈసారి ఈ వేలాన్ని ముంబైలోనే నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నారట. ఈ మేరకు 10 ఫ్రాంచైజీలతో బీసీసీఐ చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఇలాంటి నేపథ్యంలో ఐపీఎల్ 2026 టోర్నమెంట్ కోసం చెన్నై సూపర్ కింగ్స్ జట్టు భారీ ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
వచ్చే సీజన్ లో కుర్ర క్రికెటర్లకు అవకాశం ఇవ్వాలని ధోని ప్లాన్ చేస్తున్నారట. ఇందులో భాగంగానే ఏకంగా సీనియర్ ప్లేయర్లు ఐదుగురిని తొలగించాలని అనుకుంటున్నారట. దీపక్ హూడా, విజయ్ శంకర్, రాహుల్ త్రిపాఠి అలాగే సామ్ కరణ్ అటు డెవన్ కాన్వే లాంటి సీనియర్ ప్లేయర్లను వదిలేసేందుకు చెన్నై నిర్ణయం తీసుకుందని జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఇప్పటికే అశ్విన్ రిటైర్ కావడంతో చెన్నై పర్సులోకి 9.75 కోట్లు తిరిగి వచ్చాయి. ఆ డబ్బుతో కూడా మంచి ప్లేయర్లను కొనుగోలు చేసే ఛాన్స్ ఉంది. ఇలా ఇప్పటినుంచి టోర్నమెంట్ పై ఫోకస్ పెట్టింది చెన్నై.






