క్రికెట్ కురువృద్ధుడు కన్నుమూత.. శోకసంద్రంలో సౌతాఫ్రికా

by Kema Shiva Kumar |   (  Updated:2025-03-01 08:54:47  IST  )

క్రికెట్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.

క్రికెట్ కురువృద్ధుడు కన్నుమూత.. శోకసంద్రంలో సౌతాఫ్రికా
X

దిశ, వెబ్‌డెస్క్: క్రికెట్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప్రపంచంలోనే అత్యంత వృద్ధ టెస్ట్ క్రికెటర్ రాన్ డ్రేపర్ (Ron Draper) (98) కన్నుమూశారు. గత కొన్ని రోజులగా ఆయన అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే, దక్షిణాఫ్రికా (South Africa)కు ప్రాతినిధ్యం వహించిన రాన్ డ్రేపర్ జట్టులో టాపార్డర్ బ్యా్ట్స్‌మెన్, వికెట్ కీపర్‌గా బాధ్యతలను నిర్వర్తించారు. ఇంటర్‌నేషనల్ కెరీర్ (International Career) మొత్తంలో కేవలం 2 టెస్ట్ మ్యాచ్‌లు మాత్రమే ఆస్ట్రేలియాపై ఆడాడు. ఆ రెండు మ్యాచ్‌లలో కలిపి మొత్తం 25 పరుగులు చేశాడు. రాన్ డ్రేపర్ (Ron Draper) 19 ఏళ్ల వయసులో ప్రావిన్స్ తరపున ఆరెంజ్ ఫ్రీ స్టేట్‌ (Orange Free State)పై ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో అరంగేట్రం చేశారు. మొత్తం కెరీర్‌లో రాన్ డ్రేపర్ (Ron Draper) 11 శతకాలు, 11 అర్ధ శతకాలతో పాటు 32 క్యాచులు అందుకున్నాడు.

Next Story