సీఎం రేవంత్‌ను కలిసిన క్రికెటర్‌ తిలక్‌ వర్మ.. ప్రేమతో బ్యాట్ బహూకరణ

by Kema Shiva Kumar |

ఆసియా కప్ ఫైనల్‌లో దుమ్ములేపిన తెలుగు యువ క్రికెటర్ తిలక్ వర్మ సీఎం రేవంత్ రెడ్డి‌ని మర్యాదపూర్వకంగా కలిశారు.

సీఎం రేవంత్‌ను కలిసిన క్రికెటర్‌ తిలక్‌ వర్మ.. ప్రేమతో బ్యాట్ బహూకరణ
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఆసియా కప్ ఫైనల్‌లో దుమ్ములేపిన తెలుగు యువ క్రికెటర్ తిలక్ వర్మ సీఎం రేవంత్ రెడ్డి‌ని మర్యాదపూర్వకంగా కలిశారు. మంగళవారం జూబ్లీహిల్స్‌లోని ముఖ్యమంత్రి నివాసంలో క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి‌తో కలిసి తిలక్ వర్మ రేవంత్‌ను కలిశారు. ఆసియా కప్-2025 ఫైనల్ మ్యాచ్‌లో పాక్‌పై భారత్ విజయంలో తిలక్​ వర్మ కీలకపాత్ర పోషించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా తిలక్ వర్మను సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా అభినందించి సత్కరించారు. అనంతరం తిలక్ వర్మ సీఎం రేవంత్ రెడ్డికి క్రికెట్ బ్యాట్ బహూకరించారు. ఈ కార్యక్రమంలో శాట్స్ చైర్మన్ శివసేనా రెడ్డి, శాట్స్ ఎండీ సోనిబాల దేవి, సీఎం ముఖ్య కార్యదర్శి శ్రీనివాస రాజు, ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షుడు రోహిన్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Next Story