Flash: అనుకోని సంఘటనతో ఆగిపోయిన క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి

by Naga Rani Yarlagadda |

మరికొద్దిసేపటిలో క్రికెటర్ స్మృతి మంధాన వివాహం ఆమె ప్రియుడు పాలష్ ముచ్చల్ తో ఘనంగా జరగాల్సి ఉండగా..

Flash: అనుకోని సంఘటనతో ఆగిపోయిన క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి
X

దిశ, వెబ్‌డెస్క్: మరికొద్దిసేపటిలో క్రికెటర్ స్మృతి మంధాన వివాహం ఆమె ప్రియుడు పాలష్ ముచ్చల్ తో ఘనంగా జరగాల్సి ఉండగా.. అనుకోని సంఘటనతో ఆమె పెళ్లి వాయిదా పడింది. మహారాష్ట్రలోని సంగ్లీ జిల్లా సాందోల్ లో గల మంధాన ఫాంహౌస్ వద్ద వివాహానికి ఘనంగా ఏర్పాట్లు జరిగాయి. కొద్దిరోజులుగా వీరి ప్రీవెడ్డింగ్ సెలబ్రేషన్స్ ఫొటోలు కూడా నెట్టింట వైరల్ గా మారాయి. ఇటీవల జరిగిన సంగీత్ లో కూడా స్మృతి చాలా జోష్ ఫుల్ గా డ్యాన్స్ చేసింది. ఈ వివాహ వేడుకను చూసేందుకు దేశ నలుమూలల నుంచి పలువురు అతిథులు సంగ్లీకి చేరుకున్నారు.

కానీ.. స్మృతి తండ్రి శ్రీనివాస్ మంధానకు అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో ఆయన్ను ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నప్పటికీ పెళ్లిని వాయిదా వేయాలని కుటుంబం నిర్ణయించింది. కొద్దిసేపట్లో పెళ్లి జరుగుతుందనగా తండ్రికి గుండెపోటు రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె బిజినెస్ మేనేజర్ తుహిన్ మిశ్రా ఈ విషయాన్ని వెల్లడించారు. ఎమర్జెన్సీ నేపథ్యంలో వివాహ వేడుకల్ని వెంటనే రద్దు చేస్తున్నట్లు తెలిపారు. తదుపరి వివాహ తేదీ ఎప్పుడు అనేది వెల్లడించలేదు.

Next Story