- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Plane Crash : ఇకపై ఎయిర్ ఇండియా విమానం ఎక్కను : వార్నర్ సంచలన ప్రకటన
అహ్మదాబాద్ ఘోర విమాన ప్రమాదం(Ahmedabad Plane Crash)పై ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్(David Warner) సంచలన ప్రకటన చేశారు.

దిశ, వెబ్ డెస్క్ : అహ్మదాబాద్ ఘోర విమాన ప్రమాదం(Ahmedabad Plane Crash)పై ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్(David Warner) సంచలన ప్రకటన చేశారు. ఇకపై తాను ఎయిర్ ఇండియా విమానం ఎక్కబోనని వెల్లడించారు. అయితే అంతకముందు ఎయిర్ ఇండియా మాజీ ఉద్యోగి వివేక్ ఆ సంస్థపై పలు సంచలన ఆరోపణలు చేశారు. బోయింగ్ విమానాల్లో(Boeing Aircrafts) చాలా ఏళ్లుగా సమస్యలు ఉన్నాయని తెలిపాడు. వీటిని పైలట్, ఇంజనీర్లు, క్రూ సిబ్బంది అంతా సంస్థ యాజమాన్యం దృష్టికి తీసుకు వెళ్ళినా పట్టించుకోలేదు అంటూ ఓ వీడియో కింద కామెంట్ చేశాడు.
ఈ కామెంట్ స్క్రీన్ షాట్ ను వార్నర్ షేర్ చేస్తూ.. ఒకవేళ ఇది నిజమైతే, నేను ఇకపై ఎయిర్ ఇండియా విమానం ఎక్కను" అంటూ పోస్ట్ చేశారు. డేవిడ్ వార్నర్ చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా గురువారం అహ్మదాబాద్ నుంచి లండన్ కు బయలుదేరిన ఎయిర్ ఇండియా బోయింగ్(Air India Boeing) విమానం టేకాఫ్ అయిన కొద్ది సెకన్లలోనే కుప్పకూలింది. ఈ ఘటనలో ఇప్పటి వరకు 269 మంది మృతి చెందారు.






