- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కోహ్లీని చూసినప్పుడల్లా అదే అనుకుంటా.. విరాట్‌పై రూట్ ఆసక్తికర వ్యాఖ్యలు
టీమ్ ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీపై ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ జోరూట్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

దిశ, స్పోర్ట్స్ : టీమ్ ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీపై ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ జోరూట్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో కోహ్లీ గురించి రూట్ మాట్లాడాడు. విరాట్‌తో తాను ఎప్పుడూ పోటీపడలేదన్నాడు. కానీ, అతన్ని ప్రతిసారి మెచ్చుకుంటూనే ఉంటానని చెప్పాడు. అతన్ని చూసినప్పుడుల్లా ‘వావ్, వాటే ప్లేయర్’ అని అనుకునేవాడినని తెలిపాడు. మైదానంలో తాము కలిసి చేసిన యుద్ధాలను కోల్పోతామని, కానీ, కోహ్లీ రిటైర్ అవడంతో ఇతర ప్లేయర్లకు అవకాశాలు లభిస్తాయన్నాడు. రోహిత్, కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటించడంతో క్రికెట్ పేదది అయిందన్నాడు. ‘వారిద్దరూ భారత దిగ్గజాలు. సుదీర్ఘ కాలంపాటు పాటు భారత క్రికెట్‌కు వారు ఎంతో చేశారు. వారిద్దరూ లేకపోవడంతో భారత్, ఇంగ్లాండ్ టెస్టు సిరీస్ భిన్నంగా అనిపిస్తుంది. కానీ, పోటీ మాత్రం అలాగే ఉంటుందని ఆశిస్తున్నా.’అని రూట్ చెప్పుకొచ్చాడు. భారత్, ఇంగ్లాండ్ మధ్య ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా శుక్రవారం నుంచి తొలి టెస్టు ప్రారంభంకానుంది.






