IND VS WI: బోసిపోయిన స్టేడియం..కోహ్లీ, రోహిత్ ప్ల‌కార్డులు ప‌ట్టుకుని !

by velandi.Saikiran |

వెస్టిండీస్ వర్సెస్ ఇండియా మధ్య జరుగుతున్న టెస్ట్ సిరీస్ కు ప్రేక్షకుల నుంచి ఆదరణ రావడం లేదని అంటున్నారు విశ్లేష‌కులు.

IND VS WI: బోసిపోయిన స్టేడియం..కోహ్లీ, రోహిత్ ప్ల‌కార్డులు ప‌ట్టుకుని !
X

దిశ‌, వెబ్ డెస్క్: టీమిండియా వర్సెస్ వెస్టిండీస్ జట్ల మధ్య రెండో టెస్టు ఇవాళ ప్రారంభమైన సంగతి తెలిసిందే. మొదట అహ్మదాబాద్ వేదికగా జరగగా, ఈ రెండో టెస్టు ఢిల్లీ వేదికగా జరుగుతోంది. అయితే ఈ టెస్ట్ సిరీస్ కు ప్రేక్షకుల నుంచి పెద్దగా ఆదరణ లభించడం లేదు. అహ్మదాబాద్ టెస్టులో ఎదురైన పరిస్థితి, ఢిల్లీలో కూడా కనిపిస్తోంది. టీమిండియా మ్యాచ్ ఉందంటే, కచ్చితంగా జనాలు వస్తారన్న నమ్మకం ఉండేది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. దీనంతటికీ కారణం రోహిత్ శర్మ అలాగే విరాట్ కోహ్లీ జట్టులో లేకపోవడం.

ఇద్దరూ టెస్టులు అదే సమయంలో టీ20 లకు రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. కేవలం వన్డేలు మాత్రమే ఆడుతున్నారు. అందుకే, వెస్టిండీస్ వర్సెస్ ఇండియా మధ్య జరుగుతున్న టెస్ట్ సిరీస్ కు ప్రేక్షకుల నుంచి ఆదరణ రావడం లేదని అంటున్నారు విశ్లేష‌కులు. అందుకే ఢిల్లీ స్టేడియానికి వచ్చిన రోహిత్ శర్మ, కోహ్లీ అభిమానులు వినూత్న ప్రదర్శన చేస్తున్నారు. రోకో కాంబినేషన్ ను మేము మిస్ అవుతున్నాం.. వాళ్లు రావాల్సిందే, వాళ్ళిద్దరు ఆడితేనే మ్యాచ్ లు చూస్తాం అన్న రేంజ్ లో ప్లకార్డులు పట్టుకొని ఫ్యాన్స్ సందడి చేస్తున్నారు. దీనికి సంబంధించిన పోస్టులు వైరల్ అవుతున్నాయి. క్లిక్

Next Story