పీకల్లోతు కష్టాల్లో పంజాబ్... కంగ్రాట్స్ RCB అంటూ ట్రెండింగ్

by velandi.Saikiran |

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 ( IPL 2025) టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ ( Punjab Kings) పీకల్లోతు కష్టాల్లో ప

పీకల్లోతు కష్టాల్లో పంజాబ్... కంగ్రాట్స్ RCB అంటూ ట్రెండింగ్
X

దిశ, వెబ్ డెస్క్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 ( IPL 2025) టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ ( Punjab Kings) పీకల్లోతు కష్టాల్లో పడింది. అవలీలగా గెలవాల్సిన మ్యాచ్ ను చేజేతులా... పోగొట్టుకునేలా కనిపిస్తోంది పంజాబ్ కింగ్స్. ఇప్పటికే నాలుగు వికెట్లు కోల్పోయిన పంజాబ్ కింగ్స్... పోరాడుతోంది. కాపాడడం మొత్తం కుప్పకూలింది. ప్రస్తుతం 13 ఓవర్లు ఆడిన పంజాబ్ కింగ్స్... నాలుగు కీలక వికెట్లను కోల్పోయింది.

ఇప్పటి వరకు కేవలం 103 పరుగులు మాత్రమే చేసింది. 42 బంతుల్లో.. ఇంకా 88 పరుగులు చేయాల్సి ఉంది. ఆస్కింగ్ రేట్ విపరీతంగా పెరుగుతుంది. క్వాలిఫైయర్ 2 మ్యాచ్లో అద్భుతంగా ఆడిన పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ( Shreyas Iyer)... ఈ మ్యాచ్ లో ఒకే ఒక్క పరుగు చేసేటయ్యాడు.

ప్రస్తుతం నెహ్యాల్ వధేరా ( Nehal Wadhera), శశాంక్ సింగ్ ( Shashank Singh) ఇద్దరు బ్యాటింగ్ చేస్తున్నారు. ఈ ఇద్దరిలో మరో వికెట్ పడితే.. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు మొదటిసారి ఛాంపియన్ కావడం గ్యారెంటీ అంటున్నారు. ఈ నేపథ్యంలోనే... కంగ్రాట్స్ RCB (Congratulations RCB) అంటూ సోషల్ మీడియాలో... ఓ యాష్ ట్యాగ్ ను ట్రెండ్ చేస్తున్నారు. మరి ఈ మ్యాచ్ లో ఎవరు గెలుస్తారో చూడాలి.

Next Story