- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Champions Trophy : సెమీస్‌లో భారత్ తలపడేది ఆ జట్టుతోనే.. ఎప్పుడంటే?
చాంపియన్స్ ట్రోఫీలో సెమీస్‌కు చేరుకున్న జట్లు ఖరారయ్యాయి.

దిశ, స్పోర్ట్స్ : చాంపియన్స్ ట్రోఫీలో సెమీస్‌కు అర్హత సాధించిన నాలుగు జట్లేవో తేలిపోయాయి. గ్రూపు-ఏ నుంచి భారత్, న్యూజిలాండ్, గ్రూపు-బి నుంచి సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా నాకౌట్‌కు చేరుకున్నాయి. టీమిండియా మూడు విజయాలతో 6 పాయింట్లు సాధించి గ్రూపు-ఏలో అగ్రస్థానంలో నిలిచింది. కివీస్ 4 పాయింట్లతో రెండో స్థానం దక్కించుకుంది. ఇక, గ్రూపు-బిలో సౌతాఫ్రికా 5 పాయింట్లతో టాప్‌లో నిలువగా.. ఆస్ట్రేలియా 4 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది. తొలి సెమీస్‌లో ఆస్ట్రేలియాతో భారత్ తలపడనుంది. దుబాయ్ వేదికగా మంగళవారం ఈ మ్యాచ్ జరగనుంది. భారత్, ఆస్ట్రేలియా జట్లు చివరిసారిగా వన్డేల్లో 2023 వన్డే వరల్డ్ కప్ ఫైనల్‌లో ఎదురుపడ్డాయి. ఆ మ్యాచ్‌లో భారత్‌ను ఓడించిన ఆసిస్ వన్డే ప్రపంచకప్‌ను కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. ఆ ఓటమికి ఇప్పుడు ప్రతీకారం తీర్చుకోవాలని రోహిత్ సేన భావిస్తున్నది. బుధవారం జరిగే రెండో సెమీస్‌లో సౌతాఫ్రికా, న్యూజిలాండ్ ఎదురుపడతాయి.






