భారత ప్లేయర్ల తీరుపై ఐసీసీకి ఫిర్యాదు చేస్తాం.. PCB చైర్మన్ కీలక వ్యాఖ్యలు

by Kema Shiva Kumar |

అండర్-19 ఆసియా కప్ ఫైనల్‌ (Under-19 Asia Cup Final)లో భారత జట్టు పాకిస్తాన్ చేతిలో పరాజయం పాలైన విషయం తెలిసిందే.

భారత ప్లేయర్ల తీరుపై ఐసీసీకి ఫిర్యాదు చేస్తాం.. PCB చైర్మన్ కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: అండర్-19 ఆసియా కప్ ఫైనల్‌ (Under-19 Asia Cup Final)లో భారత జట్టు పాకిస్తాన్ చేతిలో పరాజయం పాలైన విషయం తెలిసిందే. అయితే, భారత ప్లేయర్లు నిబంధనలకు విరుద్దంగా ప్రవర్తించారని, వారిపై ఐసీసీ (ICC)కి ఫిర్యాదు చేస్తామని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు చైర్మెన్ మోహ్‌సిన్ నఖ్వీ (Mohsin Naqvi) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఐసీసీ రూల్స్ ప్రకారం రాజకీయాలకు క్రికెటర్లు దూరంగా ఉండాలని, కానీ భారత ఆటగాళ్లు తమ పట్ల అనుచితంగా ప్రవర్తించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మైదానంలో కూడా తమ ఆటగాళ్లను తరుచూ రెచ్చగొట్టారని తెలిపారు. భారత ఆటగాళ్లపై అధికారికంగా ఐసీసీకి ఫిర్యాదు చేస్తామని అన్నారు. కాగా, మ్యాచ్ ప్రజెంటేషన్ సందర్భంగా మోహ్‌సిన్ నఖ్వీ చేతుల మీదుగా రన్నరప్ మెడల్స్ స్వీకరించేందుకు భారత అండర్-19 జట్టు ఆటగాళ్లు నిరాకరించారు. దీంతో ఐసీసీ అసోసియేట్ డైరెక్టర్ ముబష్శిర్ ఉస్మానీ (Mubashir Usmani) చేతుల మీదుగా భారత ఆటగాళ్లు మెడల్స్ అందుకున్నారు. ఈ ఘటనపై నఖ్వీ తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ ఇలా నోరుపారేసుకున్నాడు.

Next Story