- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
భారత్, పాకిస్తాన్ మ్యాచ్ కు మరో గండం..!
ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య జరిగే మ్యాచ్ కు వర్షం విలన్ గా మారనుంది. ఫిబ్రవరి 15వ తేదీన కొలంబోలో వర్షం పడనుందని సమాచారం అందుతోంది. ఇదే జరిగితే మ్యాచ్ రద్దు అయ్యే ఛాన్స్ ఉంది.

దిశ, వెబ్ డెస్క్: భారత్, పాకిస్తాన్ మధ్య మ్యాచ్ కు సమయం దగ్గర పడుతోంది. ఎల్లుండి ఈ రెండు గట్ల మధ్య ఫైట్ ఉంటుంది. టీ20 వరల్డ్ కప్ 2026 లో భాగంగా పాకిస్తాన్, ఇండియా తలపడతాయి. అయితే ఈ మ్యాచ్ చాలా ఉత్కంఠ భరితంగా సాగనుంది. చివరి క్షణంలో ఈ మ్యాచ్ షెడ్యూల్ కాగా... అంతకు ముందు భారత్ తో మ్యాచ్ ఆడబోమని పాకిస్తాన్ అనేక రకాల కారణాలు చెప్పిన సంగతి తెలిసిందే. కానీ చివరకు ఇండియా తో మ్యాచ్ ఆడాల్సి వచ్చింది పాకిస్తాన్. దీంతో ఆదివారం ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది.
ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ కు వర్షం విలన్
టీ20 వరల్డ్ కప్ లో భాగంగా భారత్, పాకిస్తాన్ మధ్య మ్యాచ్ కు తీవ్ర అంతరాయం ఏర్పడే ప్రమాదం పొంచి ఉన్నట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి 15వ తేదీన కొలంబోలో వర్ష పాతం ఉండే ఛాన్సులు ఉన్నట్లు హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ. 70 నుంచి 85% వరకు కొలంబోలో వర్ష పాతం ఉన్నట్లు స్పష్టమవుతోంది. అంటే కచ్చితంగా ఇండియాతో జరిగే పాక్ మ్యాచ్ సందర్భంగా వర్షం పడే ప్రమాదమే ఉంది. ఒకవేళ వర్షం పడి మ్యాచ్ ఆగిపోతే చెరో పాయింట్ ఇస్తారు. లేదా రెండు జట్లు మ్యాచ్ ఆడాల్సిందే. అయితే ఈ మ్యాచ్ కు వర్షం విలన్ గా మారే ప్రమాదం ఉన్న నేపథ్యంలో అభిమానులు టెన్షన్ పడుతున్నారు. ఎన్నో రోజులుగా వేచి చూస్తున్న ఈ ఫైట్ కు వర్షం అంతరాయం కలిగించకూడదని కోరుతున్నారు. అయితే, వర్షం పడి మ్యాచ్ రద్దు అయితే, కోట్లల్లో నష్టం జరిగే ప్రమాదం ఉంది.
కొలంబోకు చేరుకున్న భారత జట్టు
టీ20 ప్రపంచ కప్ లో భాగంగా భారత్ (Team India), పాకిస్తాన్ ( Pakistan) మ్యాచ్ ఆదివారం జరగనుంది. ఈ నేపథ్యంలో కొలంబోకు చేరుకుంది భారత జట్టు. మొన్న నమీబియాతో ఢిల్లీ వేదికగా మ్యాచ్ ఆడింది భారత్. ఈ మ్యాచ్ లో విజయం సాధించిన భారత్, ఆదివారం మరో భయంకరమైన ఫైట్ కోసం సిద్ధమైంది. పాకిస్తాన్ తో కొలంబో వేదికగా మ్యాచ్ ఆడనుంది భారత జట్టు. ఈ మ్యాచ్ నేపథ్యంలో ఢిల్లీ నుంచి నేరుగా శ్రీలంకకు వెళ్ళింది భారత జట్టు. అయితే ఈ జట్టులో అభిషేక్ శర్మ కూడా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. మొన్న మొదటి మ్యాచ్ ఆడిన అభిషేక్ శర్మ తీవ్ర అనారోగ్యం బారిన పడ్డారు. దీనివల్ల అభిషేక్ శర్మ ఆసుపత్రి పాలయ్యాడు. అయితే ఇప్పుడిప్పుడే కోరుకుంటున్నా అభిషేక్ శర్మ.. ఆదివారం మ్యాచ్ కు సిద్ధము కానున్నాడట. ఇక టీ20 వరల్డ్ కప్ లో భాగంగా భారత్, పాకిస్తాన్ మధ్య మ్యాచ్ లో అభిషేక్ శర్మ ఆడితే, బాగుంటుందని ఫ్యాన్స్ అంటున్నారు.






