రోహిత్ శర్మ, కోహ్లీల ఫ్యాన్స్‌కు కోచ్ గంభీర్ ఊహించని షాక్

by Malleboina Mahesh |

ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా సిరీస్‌లలో యువ ఆటగాళ్ల ప్రదర్శన పట్ల సంతృప్తి చెందిన భారత క్రికెట్ కోచ్ గౌతమ్ గంభీర్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల భవిష్యత్తు గురించి ముఖ్యమైన వ్యాఖ్యలు చేశారు.

రోహిత్ శర్మ, కోహ్లీల ఫ్యాన్స్‌కు కోచ్ గంభీర్ ఊహించని షాక్
X

దిశ, వెబ్‌డెస్క్: సౌతాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్ ను 2-1 తేడాతో భారత్ కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ సిరీస్ లో యువ ప్లేయర్లతో పాటు, సీనియర్ ప్లేయర్లు అయిన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు మంచి ఫామ్ కనబరిచారు. ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా సిరీస్‌లలో యువ ఆటగాళ్ల ప్రదర్శన పట్ల సంతృప్తి చెందిన భారత క్రికెట్ కోచ్ గౌతమ్ గంభీర్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల భవిష్యత్తు గురించి ముఖ్యమైన వ్యాఖ్యలు చేశారు. వారు ప్రపంచ కప్ ఆడటంపై రిపోర్టర్ ప్రశ్నించగా.. వారిద్దరి గురించి మాట్లాడిన గంభీర్.. "వారందరూ అద్భుతమైన ఆటగాళ్లే. అయితే, వచ్చే ప్రపంచకప్‌కు మరో రెండేళ్లు ఉంది (2027 WC) అని మీరు తెలుసుకోవాలి.

ప్రస్తుతం ఆట గురించి ఆలోచించడం చాలా ముఖ్యం. యంగ్ ప్లేయర్స్ ఇప్పుడు అవకాశాలను సద్వినియోగం చేసుకుంటున్నారు" అని స్పష్టం చేశారు. వారిద్దరిపై ఇప్పుడు ఎలాంటి గ్యారెంటీ ఇవ్వలేనంటూ గంభీర్ పరోక్షంగా వారి సీనియారిటీకి పెద్దగా ప్రాధాన్యం ఇవ్వలేదని అర్థమవుతోంది. అంటే, రోహిత్, కోహ్లీలు 2027 ప్రపంచకప్‌లో ఆడతారా లేదా అనే దానిపై కోచ్‌గా తాను ఎలాంటి హామీ ఇవ్వలేదని గంభీర్ తేల్చి చెప్పారు. ప్రస్తుతానికి యువ ఆటగాళ్లపై దృష్టి సారించాలని, వారు అద్భుతంగా రాణిస్తున్నారని ఆయన పేర్కొన్నారు.

యువ ప్లేయర్స్ రాకతో టీమ్ ఇండియాలో బలమైన పోటీ ఏర్పడిందని, ఇది భవిష్యత్తుకు శుభసూచకమని ఆయన అభిప్రాయపడ్డారు. గంభీర్ వ్యాఖ్యలు క్రికెట్ అభిమానులలో చర్చనీయాంశంగా మారాయి, సీనియర్ ఆటగాళ్లు తమ ఫామ్‌ను కొనసాగించాల్సిన అవసరాన్ని ఈ మాటలు పరోక్షంగా నొక్కి చెబుతున్నాయి. అలాగే వరల్డ్ కప్ లో రోకోలా కాంబినేషన్ పై ఎన్నో ఆశలు పెట్టుకున్న అభిమానులకు కోచ్ గంభీర్ వ్యాఖ్యలు అసహనాన్ని కలిగిస్తున్నాయి. దీంతో ఆయనపై సోషల్ మీడియా వేదికగా సెటైర్లు వేస్తూ.. పోస్టులు పెడుతున్నారు.

Next Story