సీఎం KCR క్రికెట్ ట్రోఫీని లాంచ్ చేసిన హీరో నాని..

by Disha Web Desk 13 |
సీఎం KCR క్రికెట్ ట్రోఫీని లాంచ్ చేసిన హీరో నాని..
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ముఖ్యమంత్రి KCR పుట్టిన రోజు సందర్భంగా సీఎం KCR క్రికెట్ ట్రోఫీ సీజన్ 3 ని సిద్దిపేటలో లాంచ్ చేశారు. ఈ కార్యక్రమానికి హీరో నాని, క్రికెటర్ అంబటి రాయుడు, మంత్రి హరీష్ రావు విచ్చేసి ప్రారంభించారు.


గురువారం రాత్రి సిద్దిపేట పట్టణంలోని ప్రొఫెసర్‌ జయశంకర్‌ స్టేడియంలో ప్రారంభమైంది. హీరో నాని, ప్రముఖ క్రికెటర్‌ అంబటి రాయుడులతో కలిసి రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు ఈ పోటీలను ప్రారంభించారు.


అనంతరం మంత్రి హరీశ్‌రావు, నాని, రాయుడు సరదాగా క్రికెట్‌ ఆడారు. మొత్తం 368 జట్లు ఈ టోర్నీలో పాల్గొంటున్నాయి. ఈ కార్యక్రమంలో టోర్నీ నిర్వాహకులు మచ్చ వేణుగోపాల్‌రెడ్డి కలకుంట్ల మల్లికార్జున్‌, మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ రాజనర్సు తదితరులు పాల్గొన్నారు. కాగా, ప్రపంచంలోనే ఇది అతిపెద్ద టోర్నీ అని అతిథులు కొనియాడారు.

Next Story

Most Viewed