రేపే భార‌త్‌, ద‌క్షిణాఫ్రికా మ్యాచ్‌...విడిపోయిన‌ అన్న‌ద‌మ్ములు !

by velandi.Saikiran |

రేపే భార‌త్‌, ద‌క్షిణాఫ్రికా మ్యాచ్ జ‌రుగ‌నుండ‌గా అల్బీ మోర్కెల్, మోర్నే మోర్కెల్ వ్య‌వ‌హారం హాట్ టాపిక్ అయింది.

రేపే భార‌త్‌, ద‌క్షిణాఫ్రికా మ్యాచ్‌...విడిపోయిన‌ అన్న‌ద‌మ్ములు !
X

దిశ, వెబ్ డెస్క్‌: భారత్ మరో కీలక పోరుకు సిద్ధమైంది. టీ20 వరల్డ్ కప్ 2026లో భాగంగా ఆదివారం దక్షిణాఫ్రికాతో భారత్ సూపర్ 8 తొలి మ్యాచ్ ఆడబోతోంది. ఈ రెండు జట్ల మధ్య మోడీ స్టేడియంలో మ్యాచ్ జరగనుంది. రాత్రి 7 గంటలకు ప్రారంభం కానున్న ఈ మ్యాచ్ కోసం ఇప్పటికే అహ్మదాబాద్ చేరుకొని ఇరు జట్లు ప్రాక్టీస్ చేస్తున్నాయి. గ్రూప్ స్టేజ్ లో అదరగొట్టిన భారత జట్టు, సూపర్ 8 స్టేజ్‌ లో కూడా దూసుకు వెళ్లాలని కసరత్తులు చేస్తోంది. ఆ దిశగా గౌతమ్ గంభీర్ ఆధ్వర్యంలో భారత ప్లేయర్లు నెట్స్ లో చాలా కష్టపడుతున్నారు. చాలా క‌సిగా ప్రాక్టీస్ చేస్తున్నారు.

భారత్, దక్షిణాఫ్రికా మ్యాచ్.. ఆ అన్నదమ్ముల మధ్య గొడవ !

భారత్, దక్షిణాఫ్రికా మధ్య మ్యాచ్ జరగనున్న నేపథ్యంలో ఆ ఇద్దరు అన్నదమ్ములు విడిపోనున్నారు. శత్రువులుగా మారబోతున్నారు. ఆ ఇద్దరు ఎవరో కాదు అల్బీ మోర్కెల్, మోర్నే మోర్కెల్. ప్రస్తుతం భారత జట్టుకు బౌలింగ్ మోర్నే మోర్కెల్ వ్యవహరిస్తున్నాడు. అటు దక్షిణాఫ్రికా జట్టుకు సలహాదారుడిగా అల్బీ మోర్కెల్ ఉన్నాడు. కేవలం టీ20 వరల్డ్ కప్ కోసం మాత్రమే అల్బీ మోర్కెల్ ను నియామకం చేసింది దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు. ఇక ఈ ఇద్దరు అన్నదమ్ములు అల్బీ మోర్కెల్, మోర్నే మోర్కెల్ దక్షిణాఫ్రికాకు చెందిన వాళ్లే.

కానీ ఇప్పుడు అల్బీ మోర్కెల్ దక్షిణాఫ్రికాకు పని చేయాలి, భారత్ కోసం మోర్నే మోర్కెల్ పనిచేయాల్సి ఉంటుంది. అంటే మ్యాచ్ పూర్తయ్యే వరకు ఇద్దరు అన్నదమ్ములు శత్రువులుగా మారబోతున్నారని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. దానికి తగ్గట్టుగానే తాజాగా అహ్మదాబాద్ స్టేడియంలో ఈ ఇద్దరు అన్నదమ్ములు అల్బీ మోర్కెల్, మోర్నే మోర్కెల్ చిట్ చాట్ లో పాల్గొన్నారు. మ్యాచ్ గురించి చర్చించారు. మ్యాచ్ అయిపోయే వరకు శత్రువులుగా మారిపోదామంటూ ఇద్దరు అనుకున్నారట. దీనికి సంబంధించిన ఫోటోలు కూడా వైరల్ గా మారాయి. ఇక అల్బీ మోర్కెల్, మోర్నే మోర్కెల్ వ్య‌వ‌హారంపై క్రికెట్ ఫ్యాన్స్ త‌మ స్టైల్ లో స్పందిస్తున్నారు. ఇండియా, ద‌క్షిణాఫ్రికా ప్లేయ‌ర్లు కొట్టుకు చచ్చినా, మాకు మాత్రం డ‌బ్బులు వ‌స్తాయ‌న్న రేంజ్ లో అల్బీ మోర్కెల్, మోర్నే మోర్కెల్ ఇద్ద‌రి వ్య‌వ‌హారం ఉంద‌ని చుర‌క‌లు అంటిస్తున్నారు ఫ్యాన్స్‌.

సూప‌ర్ 8 లో ప్ర‌తీ మ్యాచ్ కీల‌క‌మే

ఇది ఇలా ఉండ‌గా, . టీ20 వరల్డ్ కప్ 2026లో భాగంగా ఆదివారం దక్షిణాఫ్రికాతో భార‌త్ మ్యాచ్ ఉంద‌న్న సంగ‌తి తెలిసిందే. ఇక ఈ మ్యాచ్ అనంత‌రం మ‌రో రెండు మ్యాచ్ లు ఆడ‌నుంది భార‌త్. జింబాబ్వేతో ఫిబ్ర‌వ‌రి 26వ తేదీన కీల‌క మ్యాచ్ ఆడ‌నుంది భార‌త్‌. ఆ త‌ర్వాత వెస్టిండీస్ తో కీల‌క పోరు ఉంటుంది. సూప‌ర్ 8 లో జ‌రుగ‌నున్న ఈ మూడు మ్యాచ్ లు భార‌త్ చాలా కీల‌కం. ఇలాంటి త‌రుణంలో అభిషేక్ శ‌ర్మ ఫాం లేనితో బాధ‌ప‌డుతోంది భార‌త్‌. అత‌డు క్లిక్ అయితే, భార‌త్ ఛాంపియ‌న్ కావ‌డం గ్యారెంటీ.

Next Story