నన్ను ఆ టీంలో అవమానించారు.. కుంబ్లేకు చెప్పి ఏడ్చేశా: క్రిస్ గేల్

by Phanindra |

తనను ఐపీఎల్‌లో ఒక టీం దారుణంగా అవమానించిందని, కుంబ్లేకు ఈ విషయం చెప్పి ఏడ్చేశానని క్రిస్ గేల్ వెల్లడించాడు.

నన్ను ఆ టీంలో అవమానించారు.. కుంబ్లేకు చెప్పి ఏడ్చేశా: క్రిస్ గేల్
X

దిశ, స్పోర్ట్స్: ఐపీఎల్‌లో తనను అవమానించారని, ఒక సీనియర్ బ్యాటర్‌కు ఇచ్చే గౌరవం ఇవ్వలేదని యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ వెల్లడించాడు. తాజాగా ఒక యూట్యూబ్ పాడ్‌కాస్ట్‌లో తన అనుభవాలను గుర్తుచేసుకున్న ఈ లెజెండరీ బ్యాటర్.. ఐపీఎల్‌లో తనకు ఎదురైన అవమానాలను బయటపెట్టాడు. తాను పంజాబ్ కింగ్స్‌కు ఆడే సమయంలో తనకు ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వలేదని, దీంతో తన జీవితంలో మొదటిసారి డిప్రెషన్‌కు లోనయ్యానని గేల్ చెప్పాడు.

‘పంజాబ్‌తో నా ఐపీఎల్ ప్రయాణం అర్ధంతరంగా ముగిసింది. నన్ను ఆ టీంలో అవమానించారు. లీగ్‌కు అంత విలువ తెచ్చిన సీనియర్ బ్యాటర్లకు ఇచ్చే గౌరవం నాకు ఇవ్వడం లేదనిపించింది. నన్ను పిల్లాడిలా చూశారు. దీంతో నా జీవితంలో మొదటిసారి డిప్రెషన్‌కు లోనైనట్లు అనిపించింది. ఇదే విషయం గురించి అనిల్ కుంబ్లేతో మాట్లాడుతూ ఏడ్చేశా. కుంబ్లే, ఫ్రాంచైజీ విధానాలు అంతగా నన్ను బాధించాయి.

ఆ తర్వాత కేఎల్ రాహుల్ నాకు కాల్ చేసి ‘నెక్స్ట్ మ్యాచులో ఆడతావు ఎక్కడకు వెళ్లొద్దు’ అని చెప్పాడు. నేను తనకు ఆల్ ది బెస్ట్ చెప్పి, బ్యాగులు సర్దుకొని వచ్చేశా’’ అని గిల్ చెప్పుకొచ్చాడు. 2018 నుంచి 2021 వరకు కింగ్స్ ఎలెవన్ పంజాబ్ (ప్రస్తుత పంజాబ్ కింగ్స్) తరఫున గేల్ ఆడాడు. తొలి మూడు సీజన్లలో అదరగొట్టిన అతను.. చివరిదైన 2021 సీజన్లో పేలవ ప్రదర్శన చేశాడు. ఈ క్రమంలోనే సీజన్ మధ్యలోనే ‘బయో బబుల్ ఫాటిగ్’ కారణంగా చూపించి లీగ్ నుంచి తప్పుకున్నాడు. మళ్లీ అతను ఐపీఎల్ ఆడేందుకు రాలేదు.

Next Story