- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
China Masters : సింధు, సాత్విక్ జోడీ దూకుడు.. క్వార్టర్ ఫైనల్స్‌కు క్వాలిఫై
భారత స్టార్ క్రీడాకారిణి పీవీ సింధు చైనా మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీలో హవా ప్రదర్శిస్తోంది.

దిశ, స్పోర్ట్స్ : భారత స్టార్ క్రీడాకారిణి పీవీ సింధు చైనా మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీలో హవా ప్రదర్శిస్తోంది. వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసి క్వార్టర్ ఫైనల్స్‌కు దూసుకెళ్లింది. గురువారం జరిగిన రెండో రౌండ్‌లో సింధు 21-15, 21-15 తేడాతో థాయిలాండ్‌కు చెందిన పోర్న్‌పావీ చౌచువాంగ్‌ను చిత్తు చేసింది. 41 నిమిషాలపాటు సాగిన మ్యాచ్‌లో తొలి గేమును చాలా అలవోకగా గెలిచింది. అయితే, రెండో గేములో మాత్రం ప్రత్యర్థి నుంచి కాస్త పోటీ ఎదుర్కొంది. 13-13 తర్వాత దూకుడు పెంచి రెండో గేముతోపాటు మ్యాచ్‌నూ సొంతం చేసుకుంది. రెండో గేములో సింధు బలమైన కొరియా షట్లర్ యాన్ సె యంగ్‌ను ఎదుర్కొంటుంది. యాన్ సె యంగ్‌తో ఇప్పటివరకు 7 సార్లు తలపడితే అన్నింటా ఓడింది. మరి, ఈ సారైనా కొరియా ప్రత్యర్థిపై సింధు పై చేయి సాధిస్తుందో చూడాలి. పురుషుల డబుల్స్‌లో భారత జంట సాత్విక్-చిరాగ్ కూడా క్వార్టర్ ఫైనల్స్‌లో అడుగుపెట్టింది. రెండో రౌండ్‌లో సాత్విక్ జోడీ 21-13, 21-12 తేడాతో చైనీస్ తైపీకి చెందిన వాంగ్ చి లిన్-చియు హ్సియాంగ్ చీహ్ జంటను ఓడించింది. స్పష్టమై ఆధిపత్యం ప్రదర్శించిన భారత షట్లర్లు కేవలం 33 నిమిషాల్లోనే మ్యాచ్‌ను ముగించారు. క్వార్టర్స్‌లో చైనా జంట రెన్ జియాంగ్ యు-క్సీ హోనాన్‌లతో తలపడనుంది.






