- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్

దిశ, వెబ్‌డెస్క్: చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోనీ అన్నీ ఫార్మాట్‌లకు రిటైర్‌మెంట్ ప్రకటించినప్పటికి.. ఐపీఎల్‌లో ఇప్పటికీ కొనసాగుతున్నాడు. 41 ఏళ్ల వయసులోనూ యువ ఆటగాళ్లకు ధీటుగా ఆడి జట్టుకు ఐదో కప్‌ను అందించడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ నేపథ్యంలో ధోనీ చిన్ననాటి కోచ్ చంచల్ భట్టాచార్య తన శిష్యుడి గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాల్ని తెలియజేశారు. ధోనిలోని ఈ మెరుపు వేగాన్ని గుర్తించారని అన్నారు. మహీ జీవితంలో ఉన్నత స్థాయికి వెళ్తాడని.. ప్రపంచ క్రికెట్‌ను శాసిస్తాడని అప్పుడే తాను అనుకున్నట్లు ఆయన అన్నారు. "ధోనీ ప్రాక్టీస్‌ను మాత్రం ఎప్పటికీ వదలడు. ఇంకా ఫిట్‌గా ఉండటానికి కష్టపడుతున్నాడు. అతడిలోని ఈ అంశాలే.. ధోనికి ఇతర యంగ్ ప్లేయర్స్‌కు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని తెలియజేస్తుంది. గేమ్‌లో యువ ఆటగాళ్లకు దీటుగా ఆడేందుకు అతడికి శక్తినిస్తోంది" అని భట్టాచార్య అన్నారు.
అలాగే ధోనీ రిటైర్‌మెంట్ గురించి చంచల్ భట్టాచార్య స్పందించాడు. "రిటైర్‌మెంట్‌కు సరైన సమయం అనేది లేదు. ఫిట్‌నెస్‌తో పాటు కంటి చూపు అనే రెండు కీలక ఆయుధాలు ఇప్పటికీ ధోనితోనే ఉన్నాయి. ఒక క్రికెటర్ దగ్గర అది ఉంటే.. అతడు దేని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ధోని ఏ నిర్ణయం తీసుకున్నా దాన్ని పక్కాగా అమలు చేస్తాడు" అని భట్టాచార్య అన్నారు.






