బిగ్ బ్రేకింగ్: బీసీసీఐ చీఫ్ సెలక్టర్ పదవికి చేతన్ శర్మ రాజీనామా

by Disha Web Desk 19 |
బిగ్ బ్రేకింగ్: బీసీసీఐ చీఫ్ సెలక్టర్ పదవికి చేతన్ శర్మ రాజీనామా
X

దిశ, వెబ్‌డెస్క్: బీసీసీఐ చీఫ్ సెలక్టర్ పదవికి చేతన్ శర్మ రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను బీసీసీఐ కార్యదర్శి జైషాకు ఆయన పంపారు. చేతన్ శర్మ రాజీనామాను బీసీసీఐ వెంటనే ఆమోదించింది. కాగా, ఓ స్టింగ్ ఆపరేషన్‌లో చేతన్ శర్మ సంచలన వ్యాఖ్యలు చేసి వివాదంలో చిక్కుకున్న విషయం తెలిసిందే. క్రికెటర్స్ ఫిట్నెస్ సీక్రెట్స్, ఇతరత్ర వివరాలను చేతన్ బయటపెట్టడంతో బీసీసీఐలో పెనుదుమారం చెలరేగింది. అంతేకాకుండా ఫిట్నెస్ లేని క్రికెటర్లు ఇంజెక్షన్లు తీసుకుంటారని చేతన్ శర్మ చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపాయి. దీంతో అతడి వ్యాఖ్యలపై బీసీసీఐ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అత్త్యున్నత స్థానంలో ఉండి ఆటగాళ్ల సెన్సిటివ్ విషయాలను లీక్ చేయడంపై బోర్డు మండిపడింది.



Next Story

Most Viewed