- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
చెన్నై గ్రాండ్ విక్టరీ.. KKR ప్లే ఆఫ్ ఆశలు గల్లంతు !
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ నేపథ్యంలో... చాలా మ్యాచ్ ల తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ జట్టు విజయం సాధించింది.

దిశ, వెబ్ డెస్క్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ ( IPL 2025) నేపథ్యంలో... చాలా మ్యాచ్ ల తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ( CSK) విజయం సాధించింది. ఎలిమినేట్ అయిన తర్వాత కేకేఆర్ జట్టుకు ( KKR) చెన్నై సూపర్ కింగ్స్ జట్టు చుక్కలు చూపించింది. ఇవాళ కేకేఆర్ సొంత గడ్డ ఈడెన్ గార్డెన్స్ లో చెన్నై సూపర్ కింగ్స్ షో కొనసాగింది. ఇవాల్టి మ్యాచ్ లో కేకేఆర్ జట్టుపై రెండు వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ చెన్నై సూపర్ కింగ్స్. చివరి వరకు నిలబడ్డ మహేంద్ర సింగ్ ధోని.. జట్టుకు విజయాన్ని అందించాడు.
ఈ మ్యాచ్ లో కేకేఆర్ మొదట బ్యాటింగ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నిర్ణీత 20 ఓవర్లు ఆడి... 6 వికెట్లు నష్టపోయి 179 పరుగులు చేసింది. చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్లు అద్భుతంగా.. రాణించడంతో కేకేఆర్ తక్కువ స్కోరు మాత్రమే చేయగలిగింది. ఇక ఆ లక్ష్యాన్ని చేదించే క్రమంలో.. చెన్నై సూపర్ కింగ్స్ చాలా కష్టపడాల్సి వచ్చింది. కానీ.. మిడిల్ ఆర్డర్ లో వచ్చిన బ్రేవిస్ , శివం దూబే ఇద్దరు అద్భుతంగా రాణించారు. చివర్లో మహేంద్రసింగ్ ధోని మెరిశాడు. ఈ దెబ్బకు చెన్నై సూపర్ కింగ్స్ గ్రాండ్ విక్టరీ కొట్టింది. అటు ఈ మ్యాచ్ లో ఓడిపోయిన కేకేఆర్ జట్టుకు ప్లే ఆఫ్ ఆశలు మరింత కఠిన తరమయ్యాయి.






