Champions Trophy-2025: రోహిత్ శర్మకు గాయం.. అసిస్టెంట్ కోచ్ కీలక ప్రకటన

by Kema Shiva Kumar |

ఛాంపియన్స్ ట్రోఫీ-2025 (Champions Trophy-2025)లో భారత్ (India) అదరగొడుతోంది.

Champions Trophy-2025: రోహిత్ శర్మకు గాయం.. అసిస్టెంట్ కోచ్ కీలక ప్రకటన
X

దిశ, వెబ్‌డెస్క్: ఛాంపియన్స్ ట్రోఫీ-2025 (Champions Trophy-2025)లో భారత్ (India) అదరగొడుతోంది. ఇప్పటికే వరుసగా బంగ్లాదేశ్, పాకిస్థాన్ జట్లపై విజయం సాధించి సెమీ ఫైనల్‌ (Semi Final)లో బెర్త్‌ను ఖరారు చేసుకుంది. అయితే, గ్రూప్ దశలో భారత్ తన చివరి మ్యాచ్‌లో ఆదివారం న్యూజిలాండ్‌తో తలపడనుంది. ఈ క్రమంలోనే టీమిండియా (Team India) జట్టు కెప్టెన్ మారే అవకాశాలు ఉన్నాయి. పాకిస్థాన్‌ (Pakistan)తో జరిగిన మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తుండగా కెప్టెన్ రోహిత్ శర్మ (Captain Rohit Sharma) గాయపడ్డాడు. అతడి తొడ కండరాలకు గాయం అయినట్లుగా మ్యాచ్ అనంతరం ప్రెస్‌మీట్‌ (Press Meet)లో చెప్పాడు. అదేవిధంగా నెట్స్‌ (Nets)లో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తుండగా కాస్త ఇబ్బంది పడ్డాడు.

ఈ పరిణామల నేపథ్యంలో న్యూజిలాండ్‌ (New Zealand)తో జరిగే మ్యాచ్‌కు రోహిత్ శర్మ (Rohit Sharma) అందుబాటులో ఉంటాడా.. లేదా అనే అనుమానం టీమిండియా (Team India) ఫ్యాన్స్‌లో నెలకొంది. ఈ క్రమంలోనే ఇండియన్ టీమ్ అసిస్టెంట్ కోచ్ ర్యాన్‌టెన్ డస్కాటే (Ryan ten Doeschate) రోహిత్ గాయంపై క్లారిటీ ఇచ్చారు. పాత గాయంతోనే కెప్టెన్ బాధపడుతున్నారని తెలిపారు. అయితే, రాబోయే మ్యాచ్‌లో గాయాన్ని ఎలా మేనేజ్‌ చేయాలో రోహిత్‌కు బాగా తెలుసని అన్నారు. అయితే, న్యూజిలాండ్‌ (New Zealand)తో మ్యాచ్‌కు ఒకవేళ రోహిత్ అందుబాటులోకి రాకపోతే అతడి స్థానంలో జట్టు మేనేజ్‌మెంట్ రిషభ్ పంత్ (Rishabh Pant) లేదా వాషింగ్టన్ సుందర్‌ (Washington Sunder)ను ఆడించనున్నట్లుగా తెలుస్తోంది.

Next Story