టోక్యోలో తొలిసారే.. జపాన్ ఓపెన్ టైటిల్ నెగ్గిన అల్కరాజ్‌

by Phanindra |

జపాన్ ఓపెన్‌లో కార్లోస్ అల్కరాజ్‌ అదరగొట్టాడు. ఫైనల్‌లో యూఎస్ స్టార్ టేలర్ ఫ్రిట్జ్‌పై సునాయాస విజయం సాధించాడు.

టోక్యోలో తొలిసారే.. జపాన్ ఓపెన్ టైటిల్ నెగ్గిన అల్కరాజ్‌
X

దిశ, స్పోర్ట్స్: టెన్నిస్ స్టార్ కార్లోస్ అల్కరాజ్ మరో టైటిల్ తన ఖాతాలో వేసుకున్నాడు. మంగళవారం జరిగిన జపాన్ ఓపెన్ ఫైనల్‌లో యూఎస్ ప్లేయర్ టేలర్ ఫ్రిట్జ్‌పై అద్భుత విజయం సాధించాడు. టోర్నీ ఆరంభంలో చీలమండకు గాయమైనా.. టోర్నమెంట్ ఆసాంతం అల్కరాజ్ చక్కని ప్రదర్శన చేశాడు. ఫైనల్‌లో కూడా టేలర్‌కు అల్కరాజ్ ఏమాత్రం అవకాశం ఇవ్వలేదు. 6-4, 6-4తో వరుస సెట్లలో గెలిచి తొలి ప్రయత్నంలోనే జపాన్ ఓపెన్ టైటిల్ కైవసం చేసుకున్నాడు. ‘టోక్యోలో ఇదే నా తొలి టైటిల్. ఇదే చివరిది కాదని అనుకుంటున్నా’ అని నవ్వేశాడీ 22 ఏళ్ల వరల్డ్ నెంబర్ వన్ టెన్నిస్ స్టార్. ఇది అల్కరాజ్‌కు వరుసగా 9వ ఫైనల్ కావడం గమనార్హం. ఈ సీజన్‌లో అతను ఆడిన 10వ ఫైనల్ ఇది. గతంలో స్పెయిన్ స్టార్ రఫేల్ నాదల్ మాత్రమే ఇలా ఒక సీజన్‌లో 10 ఫైనల్స్‌లో ఆడాడు. ఆ రికార్డును కూడా అల్కరాజ్ సమం చేశాడు.

Next Story