కెప్టెన్ సూర్యకుమార్ ఒంటరి పోరాటం.. భారత్ భారీ స్కోర్

by Gantepaka Srikanth |   (  Updated:2026-02-07 15:31:02  IST  )

ముంబైలోని వాంఖడే మైదానం వేదికగా అమెరికాతో జరుగుతోన్న తొలి మ్యాచ్‌లో భారత్ గౌరవప్రదమైన స్కోరు చేసింది.

కెప్టెన్ సూర్యకుమార్ ఒంటరి పోరాటం.. భారత్ భారీ స్కోర్
X

దిశ, వెబ్‌డెస్క్: టీ20 ప్రపంచకప్‌(ICC Men's T20 World Cup 2026)లో భాగంగా ముంబైలోని వాంఖడే మైదానం వేదికగా అమెరికాతో జరుగుతోన్న తొలి మ్యాచ్‌లో భారత్ గౌరవప్రదమైన స్కోరు చేసింది. చివరి దాకా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఒంటరి పోరాటం చేశారు. 20 ఓవర్లలో 161-9 స్కోర్ చేసింది. కెప్టెన్ సూర్య(84) రాణించగా తిలక్ (25), ఇషాన్ (20) పర్వాలేదనిపించారు. మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. USA బౌలర్లలో స్కాల్క్విక్ 4, హర్మీత్ 2 వికెట్లు తీయగా అలీ ఖాన్, మొహమ్మద్ మోహ్సిన్ తలో వికెట్ పడగొట్టారు. అమెరికా విజయం సాధించాలంటే 162 పరుగులు చేయాలి.

అయితే.. బుమ్రా లేని లోటును మహమ్మద్ సిరాజ్, అర్ష్‌దీప్ సింగ్ భర్తీ చేయాల్సి ఉంది. వాంఖడే పిచ్‌పై మంచు ప్రభావం ఉండే అవకాశం ఉండటంతో రెండో ఇన్నింగ్స్‌లో బౌలింగ్ చేయడం భారత్‌కు సవాలుతో కూడుకున్న పని. 162 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగనున్న అమెరికాను భారత బౌలర్లు ఎలా అడ్డుకుంటారనేది ఆసక్తికరంగా మారింది.

Next Story