- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హర్దిక్ పాండ్యా ఔట్.. ముంబై కెప్టెన్ గా సూర్య
ఇవాళ ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగే మ్యాచ్ కు హార్దిక్ పాండ్యా దూరం అయ్యాడు.

దిశ, వెబ్ డెస్క్: ఐపీఎల్ 2026 నేపథ్యంలో ముంబై ఇండియన్స్ కు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. ఇవాళ ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగే మ్యాచ్ కు హార్దిక్ పాండ్యా దూరం అయ్యాడు. తీవ్ర అనారోగ్యం నేపథ్యంలో ఈ మ్యాచ్ కు దూరమైనట్లు ముంబై ఇండియన్స్ యాజమాన్యం పేర్కొంది. హార్దిక్ పాండ్యా మ్యాచ్ కు దూరం అయిన నేపథ్యంలో ముంబై ఇండియన్స్ కెప్టెన్ గా సూర్య కుమార్ యాదవ్ వ్యవహరిస్తున్నాడు. ఈ క్రమంలోనే ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ కు సంబంధించిన టాస్ కాసేపటి క్రితమే వేశారు. ఇందులో టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ అక్షర్ పటేల్, బౌలింగ్ చేయాలని నిర్ణయించుకున్నారు. దీంతో ముంబై ఇండియన్స్ ఫస్ట్ బ్యాటింగ్ చేయనుంది. అటు హర్దిక్ పాండ్యా స్థానంలో దీపక్ చాహర్ వచ్చేశాడు.
ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్
ఢిల్లీ క్యాపిటల్స్ : KL రాహుల్ (w), పాతుమ్ నిస్సాంక, నితీష్ రాణా, అక్షర్ పటేల్(c), ట్రిస్టన్ స్టబ్స్, డేవిడ్ మిల్లర్, విప్రజ్ నిగమ్, లుంగి ఎన్గిడి, కులదీప్ యాదవ్, T నటరాజన్, ముఖేష్ కుమార్
ముంబై ఇండియన్స్: రోహిత్ శర్మ, ర్యాన్ రికెల్టన్ (w), తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ (c), నమన్ ధీర్, షెర్ఫానే రూథర్‌ఫోర్డ్, మిచెల్ సాంట్నర్, కార్బిన్ బాష్, శార్దూల్ ఠాకూర్, దీపక్ చాహర్, జస్ప్రీత్ బుమ్రా






