INDvsENG: సెంచరీతో చెలరేగిన కెప్టెన్ శుభ్‌మన్ గిల్

by Gantepaka Srikanth |

ఇంగ్లాండ్, భారత్ మధ్య ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా ఇవాళ తొలి మ్యాచ్ లీడ్స్ మైదానం వేదికగా ప్రారంభమైంది.

INDvsENG: సెంచరీతో చెలరేగిన కెప్టెన్ శుభ్‌మన్ గిల్
X

దిశ, వెబ్‌డెస్క్: ఇంగ్లాండ్, భారత్ మధ్య ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా ఇవాళ తొలి మ్యాచ్ లీడ్స్ మైదానం వేదికగా ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో భారత బ్యాట్స్‌మెన్లు అదరగొడుతున్నారు. సాయి సుదర్శన్ మినహా అందరూ సత్తా చూపించారు. ఇప్పటికే ఓపెనర్ యశస్వి జైస్వాల్(101) సెంచరీ చేయగా.. తాజాగా కెప్టెన్ శుభ్‌మన్ గిల్(Shubman Gill) కూడా సెంచరీ(110)తో చెలరేగాడు. 140 బంతుల్లో 14 ఫోర్లు బాది కెరీర్లో ఆరో సెంచరీ పూర్తి చేసుకున్నారు. వెంటవెంటనే రెండు వికెట్లు పడిన దశలో క్రీజులోకి వచ్చిన గిల్ ఆత్మవిశ్వాసంతో ఆడారు. జైస్వాల్, పంత్తో కలిసి కీలక భాగస్వామ్యాలు నమోదు చేశారు. ప్రస్తుతం టీమ్ ఇండియా స్కోర్ 319/3(77 ఓవర్లు)గా ఉంది. కాగా, ఈ అండర్సన్‌‌‌‌–టెండూల్కర్‌‌‌‌ ట్రోఫీలో భాగంగా ఇంగ్లండ్‌‌‌‌తో ఐదు టెస్ట్‌‌‌‌ మ్యాచ్‌‌‌‌లు ఆడనుంది. గత పదేళ్లలో ఇండియా టెస్ట్‌‌‌‌ టీమ్‌‌‌‌కు ఐకాన్లుగా ఉన్న రోహిత్ శర్మ, విరాట్‌‌‌‌ కోహ్లీ లేకుండా తొలిసారి యువ జట్టు బరిలోకి దిగింది.

Next Story