- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పసికూనపై విజయం.. టీ20 వరల్డ్ కప్ 2026కు కెనడా క్వాలిఫై
కెనడా (Canada) క్రికెట్ టీం అరుదైన గౌరవం దక్కించుకుంది. టి20 వరల్డ్ కప్ 2026 (T20 World Cup 2026) టోర్నమెంటులో అర్హత

దిశ, వెబ్ డెస్క్: కెనడా (Canada) క్రికెట్ టీం అరుదైన గౌరవం దక్కించుకుంది. టి20 వరల్డ్ కప్ 2026 (T20 World Cup 2026) టోర్నమెంటులో అర్హత సాధించింది కెనడా కంట్రీ. ఐసీసీ మెన్స్ టి20 వరల్డ్ కప్ అమెరికాస్ రీజియన్ ఫైనల్ 2025 టోర్నమెంటులో బహమాస్ పై విజయం సాధించి వరల్డ్ కప్ టికెట్ కన్ఫర్మ్ చేసుకుంది కెనడా. దీంతో ఆ జట్టు సంబరాలు... అంబరాన్ని అంటాయి.
కీర్టన్ సేన టోర్నీలో ఇప్పటి వరకు ఐదు మ్యాచ్ ఆడిన కెనడా.. అన్ని మ్యాచ్ లలో విజయం సాధించింది. దీంతో ఇప్పుడు ఐసీసీ వరల్డ్ కప్ 2026 కు కూడా అర్హత సాధించింది. ఐసీసీ వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్... శ్రీలంక అలాగే ఇండియాలో జరగనుంది. ఈ రెండు దేశాలు ప్రాతినిధ్యం వహించబోతున్నాయి. ఈ టోర్నమెంట్ కోసం ఇప్పటికే ఇండియా, శ్రీలంక, పాకిస్తాన్, ఐర్లాండ్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్, యూఎస్ఏ దేశాలు క్వాలిఫై అయ్యాయి.
ఆస్ట్రేలియా, వెస్టిండీస్, ఇంగ్లాండ్, ఆఫ్ఘనిస్తాన్ అలాగే సౌత్ ఆఫ్రికా కూడా ఇప్పటికే క్వాలిఫై అయిన సంగతి తెలిసిందే. తాజాగా కెనడా కూడా రంగంలోకి దిగింది. ఇక ఈ టోర్నమెంట్ లో మరో ఏడు దేశాలు అర్హత సాధించాల్సి ఉందని ఐసిసి ప్రకటన చేసింది. వీటిలో యురేబియన్ క్వాలిఫైయర్ ద్వారా రెండు క్వాలిఫై అవుతాయి. ఆఫ్రికా క్వాలిఫైయర్ లో ఫైనల్ చేరిన రెండు జట్లతో పాటు ఆసియా ఈఏపీ క్వాలిఫైయర్ లోని టాప్ 3 మూడు జట్లు కూడా పోటీలకు అర్హత సాధించబోతున్నాయి. అంటే మొత్తం 20 జట్లతో మొదటిసారి టి20 ప్రపంచ కప్ జరగనుంది.






