Eng vs Ind : చెలరేగిన బుమ్రా.. 7 బాల్స్ లో 3 వికెట్లు

by Muthe.Rajitha |

ఆండర్సన్- టెండూల్కర్(Anderson-Tendulkar) ఐదు టెస్టుల సిరీస్ లో ఇంగ్లండ్, భారత్(Eng vs Ind) మధ్య మూడవ టెస్ట్ మ్యాచ్ (Test Match) జరుగుతున్న సంగతి తెలిసిందే.

Eng vs Ind : చెలరేగిన బుమ్రా.. 7 బాల్స్ లో 3 వికెట్లు
X

దిశ, వెబ్ డెస్క్ : ఆండర్సన్- టెండూల్కర్(Anderson-Tendulkar) ఐదు టెస్టుల సిరీస్ లో ఇంగ్లండ్, భారత్(Eng vs Ind) మధ్య మూడవ టెస్ట్ మ్యాచ్ (Test Match) జరుగుతున్న సంగతి తెలిసిందే. ఓవర్ నైట్ స్కోర్ 251/4 తో రెండవ రోజు ఆట ప్రారంభించిన ఇంగ్లాండ్.. లంచ్ సమయానికి 7 వికెట్లు కోల్పోయి 353 పరుగులు చేసింది. అయితే తొలి సెషన్ ప్రారంభించిన కొద్దిసేపటికే స్టోక్స్ (44), రూట్(104), వోక్స్(0) వికెట్లు కోల్పోయారు. కాగా ఈ మూడు వికెట్లను 7 బాల్స్ లోనే బుమ్రా(Bumra) పడగొట్టడం గమనార్హం. ప్రస్తుతం స్మిత్(51), కార్స్(33) క్రీజులో ఉన్నారు. ఇక తొలి మ్యాచ్ లో ఇంగ్లాండ్, రెండవ మ్యాచ్ లో భారత్ గెలిచి 1-1 తో సమానంగా ఉండగా.. ఇరు జట్లకు ఈ మ్యాచ్ కీలకంగా మారనుంది.

Next Story