Bumrah : ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి బుమ్రా ఔట్?

by Sathputhe Rajesh |

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ వేళ భారత్‌కు బిగ్ షాక్ తగలనున్నట్లు తెలుస్తోంది.

Bumrah : ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి బుమ్రా ఔట్?
X

దిశ, స్పోర్ట్స్ : ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ వేళ భారత్‌కు బిగ్ షాక్ తగలనున్నట్లు తెలుస్తోంది. భారత కీలక బౌలర్ బుమ్రా ఇటీవల ఆస్ట్రేలియాతో టెస్ట్ సందర్భంగా వెన్ను నొప్పి కారణంగా సిడ్నీ టెస్ట్‌లో బౌలింగ్‌కు దిగిన విషయం తెలిసిందే. అయితే ఇదే గాయం కారణంగా ఇంట్లోనే బెడ్ రెస్ట్ తీసుకోవాలని వైద్యులు సూచించినట్లు టైమ్ ఆఫ్ ఇండియా కథనం వెల్లడించింది. వెన్ను పూస వద్ద వాపు తగ్గిన తర్వాతే బుమ్రా ఛాంపియన్స్ ట్రోఫీ ఆడే విషయంలో నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. బుమ్రా వారం క్రితం ఆస్ట్రేలియా పర్యటన ముగియగానే ఇంటికి చేరుకున్నాడు. అయితే బుమ్రా ఆరోగ్య పరిస్థితి ఆశాజనకంగా లేదని తెలిసింది. బుమ్రా తన ఆరోగ్య పరిస్థితిపై బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌లో రిపోర్ట్ చేయాల్సి ఉండగా.. దీనికి సంబంధించి ఇంకా డేట్ ఫిక్స్ కాలేదు.

వెన్ను పూస వాపు కారణంగా బుమ్రాను ఇప్పటికిఇప్పుడు క్రికెట్ ఆడించే ఛాన్స్ లేదని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. బెడ్ రెస్ట్ తీసుకోవడం మంచిది కాదు. డయాగ్నొసిస్ తర్వాతే బుమ్రా ఎప్పటివరకు కోలుకుంటాడో చెప్పగలమని మాజీ కోచ్ రాంజీ శ్రీనివాసన్ అన్నారు. ‘వాపు డిస్క్‌లో ఉందా.. మజిల్‌లో ఉందో తేలాల్సి ఉంది. ఎడెమా ఫార్మెషన్ కారణంగా వాపు వస్తుంది. డిస్క్‌కు వాపు వచ్చినట్లయితే దాని స్థాయి, వ్యక్తిగత సామర్థ్యం, అందించే వైద్యంపై కోలుకోవడం ఆధారపడి ఉంటుంది. ఛాంపియన్స్ ట్రోఫీ, ఐపీఎల్, ఇంగ్లాండ్ తో సిరీస్ విషయంలో బుమ్రా ఆచితూచి అడుగులు వేయాలి.’ అని ఆయన అన్నారు. ఛాంపియన్స్ ట్రోఫికి తుదిజట్టును ప్రకటించేందుకు ఫిబ్రవరి 13 వరకు గడువు ఉంది. ఈ నేపథ్యంలో ఆరోగ్య పరిస్థితిపై తుది రిపోర్టు అందిన తర్వాతే సెలక్టర్లు బుమ్రాను ఆడించే విషయంలో నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.

Next Story