అరుదైన ఘనత సాధించిన బుమ్రా.. లార్డ్స్‌ ఆనర్స్‌ బోర్డుపై పేరు

by Yella Dhawani Reddy |   (  Updated:2025-07-12 16:12:57  IST  )

భారత జట్టు స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా అరుదైన ఘనత సాధించారు.

అరుదైన ఘనత సాధించిన బుమ్రా.. లార్డ్స్‌ ఆనర్స్‌ బోర్డుపై  పేరు
X

దిశ, వెబ్ డెస్క్: భారత జట్టు స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా (Jaspit Bumrah) అరుదైన ఘనత సాధించారు. ఇంగ్లాండ్‌తో (England) లార్డ్స్ మైదానంలో జరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్‌లో రెండో రోజు బుమ్రా తన అద్భుత బౌలింగ్‌తో ఆంగ్ల బ్యాటర్లను కట్టడి చేశారు. 5 వికెట్లు తీసి కేవలం 74 పరుగులే ఇచ్చిన బుమ్రా, తన టెస్టు కెరీర్‌లో మరో ఘనత సాధించారు. ఈ ప్రదర్శనతో లార్డ్స్ మైదానంలో 'ఆనర్స్ బోర్డు (Honors Board)'పై తన పేరు నమోదు చేసుకుని చరిత్ర సృష్టించారు.

కాగా, లార్డ్స్ మైదానం క్రికెట్ చరిత్రలో ప్రత్యేక స్థానం పొందింది. ఇక్కడ టెస్ట్ మ్యాచ్‌లో బ్యాటింగ్, బౌలింగ్ లేదా ఫీల్డింగ్‌లో అద్భుత ప్రదర్శన కనబరిచిన ఆటగాళ్ల పేర్లను ఆనర్స్ బోర్డుపై నమోదు చేస్తారు. ఇప్పటివరకు సునీల్ గావస్కర్, కపిల్ దేవ్, అంజుమ్ చోప్రా, మహ్మద్ షమీ లాంటి కొద్దిమంది భారత ఆటగాళ్లకే ఈ గౌరవం దక్కింది. ఇప్పుడు బుమ్రా కూడా ఆ జాబితాలోకి చేరారు.

Next Story