ఇప్పటికి ఇతర మహిళలతో అక్రమ సంబంధం.. షమీపై భార్య హాసిన్ సంచలన ఆరోపణలు

by Disha Web Desk 19 |
ఇప్పటికి ఇతర మహిళలతో అక్రమ సంబంధం.. షమీపై భార్య హాసిన్ సంచలన ఆరోపణలు
X

దిశ, వెబ్‌డెస్క్: టీమిండియా స్టార్ బౌలర్ మహ్మద్ షమీపై అతడి భార్య హాసిన్ జహాన్ సంచలన ఆరోపణలు చేశారు. ఇప్పటికి తన భర్త షమీకి ఇతర మహిళలతో వివాహేతర సంబంధాలు ఉన్నాయని ఆమె ఆరోపించారు. గృహ హింసా కేసులో మహ్మద్ షమీపై ఉన్న అరెస్ట్ వారెంట్‌పై కోల్‌కతా హైకోర్టు విధించిన స్టేను హాసిన్ జహాన్ సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. ఈ పిటిషన్‌లో ఆమె సంచలన ఆరోపణలు చేశారు. షమీ తనను కట్నం కోసం వేధించాడని.. పెళ్లి అయిన తర్వాత కూడా అతడు వేరే మహిళలతో వివాహేతర సంబంధాలు కొనసాగించాడని ఆమె పేర్కొన్నారు.

షమీ అరెస్ట్ వారెంట్‌పై కోల్‌కోతా హైకోర్టు విధించిన స్టేను ఎత్తేయాలని హాసిన్ పిటిషన్‌లో కోరారు. ఇదిలా ఉంటే.. 2018లో షమీకి, అతడి భార్యకు మధ్య విభేదాలు తలెత్తాయి. షమీ తనను వేధిస్తున్నాడంటూ ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో షమీపై గృహహింసా చట్టంలోని వివిధ సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. పశ్చిమ బెంగాల్‌లోని సెషన్స్ కోర్టు షమీపై అరెస్ట్ వారెంట్ జారీ చేయగా.. షమీ హైకోర్టును ఆశ్రయించాడు. దీంతో అరెస్ట్ వారెంట్‌పై కోల్‌కతా హైకోర్టు స్టే విధించింది.



Next Story