- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
లైంగిక ఆరోపణలపై స్పందించిన యశ్ దయాల్.. సదరు మహిళాపై రిటర్న్ కేసు పెట్టిన ఆర్సీబీ బౌలర్
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు స్టార్ బౌలర్ యశ్ దయాల్‌పై ఓ మహిళా లైంగిక ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.

దిశ, స్పోర్ట్స్ : రాయల్ చాలెంజర్స్ బెంగళూరు స్టార్ బౌలర్ యశ్ దయాల్‌పై ఓ మహిళా లైంగిక ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడని సదరు మహిళా ఫిర్యాదు మేరకు యశ్ దయాల్‌పై ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో కేసు నమోదైంది. దీనిపై యశ్ దయాల్ ఎట్టకేలకు స్పందించాడు. తనపై సదరు మహిళా చేసిన ఆరోపణలను ఖండించాడు. అలాగే, సదరు మహిళాపై ఖుల్దాబాద్ పోలిస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. తన నుంచే ఆమె భారీ మొత్తంలో డబ్బులు తీసుకుందని ఆరోపించాడు. ఐఫోన్, ల్యాప్‌టాప్ దొంగలించిందని ఫిర్యాదులో పేర్కొన్నాడు. ‘2021లో ఇన్‌స్టాగ్రామ్‌లో సదరు మహిళతో పరిచయం ఏర్పడింది. అప్పటి నుంచి ఇద్దరం మాట్లాడుకుంటున్నాం. తనకు, తన కుటుంబసభ్యులకు ట్రీట్‌మెంట్ గురించి నా నుంచి రూ. లక్షల్లో అప్పు తీసుకుంది. ఇప్పటి వరకు తిరిగి ఇవ్వలేదు. షాపింగ్ కోసమూ నా దగ్గర అప్పు చేసింది. ఇందుకు సంబంధించిన ఆధారాలన్నీ నా దగ్గర ఉన్నాయి. ఆమెతోపాటు ఆమె కుటుంబానికి చెందిన ఇద్దరిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలి. ఇందులో మరికొందరి ప్రమేయం కూడా ఉన్నట్టు నాకు అనుమానంగా ఉంది.’అని యశ్ దయాల్ తన ఫిర్యాదులో ఫేర్కొన్నాడు.
- Tags
- Yash Dayal






