BGT: పీకల్లోతు కష్టాల్లో టీమిండియా

by Gantepaka Srikanth |

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ(Border-Gavaskar Trophy)లో భాగంగా ఆస్టేలియాలోని పెర్త్ మైదానం వేదికగా తొలి టెస్టు ఇవాళ ప్రారంభమైంది.

BGT: పీకల్లోతు కష్టాల్లో టీమిండియా
X

దిశ, వెబ్‌డెస్క్: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ(Border-Gavaskar Trophy)లో భాగంగా ఆస్టేలియాలోని పెర్త్ మైదానం వేదికగా తొలి టెస్టు ఇవాళ ప్రారంభమైంది. ముందుగా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా(Team India) బ్యాటర్లు ఆదిలోనే చేతులెత్తేశారు. వరుసగా వికెట్లు సమర్పించుకున్నారు. ఓపెనర్లు యశస్వి జైశ్వాల్(0), కేఎల్ రాహుల్(26), దేవదత్ ఫడిక్కల్(0), విరాట్ కోహ్లీ(5) వంటి బ్యాటర్లంతా స్వల్ప స్కోరుకే పెవీలియన్ చేరడంతో టీమిండియా పీకల్లోతు కష్టాల్లోకి వెళ్లింది. ప్రస్తుతం క్రీజులో రిషబ్ పంత్(10), ద్రువ్ జురేల్ ఉన్నారు. వీళ్లైనా పరువు నిలుపుతారో లేదో చూడాలి. ఇప్పటివరకు 25 ఓవర్లు పూర్తి కాగా, నాలుగు వికెట్లు కోల్పోయిన భారత్.. 51 పరుగులు చేసింది.

Next Story