Kl రాహుల్ పరువు గంగలో కలిపిన బాలయ్య హీరోయిన్ ?

by velandi.Saikiran |

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ ( IPL 2025) నేపథ్యంలో... ఢిల్లీ స్టార్ ప్లేయర్ కేఎల్ రాహుల్ ( KL Rahul)

Kl రాహుల్ పరువు గంగలో కలిపిన బాలయ్య హీరోయిన్ ?
X

దిశ, వెబ్ డెస్క్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ ( IPL 2025) నేపథ్యంలో... ఢిల్లీ స్టార్ ప్లేయర్ కేఎల్ రాహుల్ ( KL Rahul) అద్భుతంగా రాణిస్తున్నాడు. ఢిల్లీ జట్టు గెలుపులో తన వంతు కృషి చేస్తున్నాడు కేఎల్ రాహుల్. ప్రతి మ్యాచ్ లో కన్సిస్టెంట్ గా బ్యాటింగ్ చేసి.. దుమ్ము లేపుతున్నాడు. అయితే అలాంటి కేఎల్ రాహుల్ పరువు మొత్తం తీసేసింది బాలీవుడ్ హీరోయిన్ సోనాల్ చౌహన్ ( Sonal Chauhan). తనకు కేఎల్ రాహుల్ అస్సలు ఇష్టం ఉండదని... తేల్చి చెప్పేసింది. గురువారం రోజున ముంబై ఇండియన్స్ ( MI) వర్సెస్ హైదరాబాద్ ( Hyderabad) జట్ల మధ్య మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే.


ఈ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ కు సపోర్ట్ గా నిలిచింది బాలీవుడ్ బ్యూటీ సోనాల్ చౌహన్. ఈ సందర్భంగా.. ముంబై గెలుపును ఆస్వాదిస్తూ.... స్టేడియం లో రచ్చ చేసింది. ఇక ఈ నేపథ్యంలోనే... తన ఫేవరెట్ క్రికెటర్ ఎవరు అనే దాని పైన క్లారిటీ ఇచ్చింది బాలీవుడ్ బ్యూటీ సోనాల్ చౌహన్. తన ఫేవరెట్ క్రికెటర్ ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ ( Rohit Sharma) అంటూ కామెంట్ చేసింది బాలీవుడ్ హీరోయిన్ సోనాల్ చౌహన్. ఎప్పటికీ రోహిత్ శర్మనే తనకు ఇష్టం అంటూ... చెప్పేసింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఈ వీడియోని చూసిన క్రికెట్ అభిమానులు.. దారుణంగా కామెంట్ చేస్తున్నారు. అప్పట్లో కే ఎల్ రాహుల్ తో ఈ బ్యూటీ రిలేషన్ పెట్టుకుందని... గుర్తు చేస్తున్నారు క్రికెట్ అభిమానులు. రాహుల్ ను వాడుకొని వదిలేసిన ఈ బ్యూటీ.. ఇప్పుడు రోహిత్ శర్మ వెంట పడుతోందని... ట్రోయింగ్ కూడా చేస్తున్నారు నెటిజన్స్. అందరూ ధనశ్రీ వర్మ లాగా క్రికెటర్లను వాడుకొని.. వదిలేస్తున్నారని కూడా మండిపడుతున్నారు. ఇలా మోసం చేసే వారిని అరికట్టేందుకు చట్టం తీసుకురావాలని కూడా డిమాండ్ చేస్తున్నారు క్రికెట్ ఫ్యాన్స్.

Next Story