- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆసియా కప్ ముందు బిగ్ ట్విస్ట్.. టీమిండియా సపోర్ట్ స్టాఫ్ నుంచి మరొకరు ఔట్
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (United Arab Emirates) వేదికగా జరగబోతున్న ఆసియా కప్ (Asia Cup) ఈవెంట్ ముందు కీలక పరిణామం చోటుచేసుకుంది.

దిశ, వెబ్‌డెస్క్: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (United Arab Emirates) వేదికగా జరగబోతున్న ఆసియా కప్ (Asia Cup) ఈవెంట్ ముందు కీలక పరిణామం చోటుచేసుకుంది. టీమిండియా సపోర్ట్ స్టాఫ్ (Team India Support Staff ) నుంచి మరొకరిని తొలగిస్తూ బీసీసీఐ (BCCI) కీలక నిర్ణయం తీసుకుంది. దాదాపు గత 15 ఏళ్లుగా జట్టుతో ఉన్న టీమ్ మసాజర్ రాజీవ్ కుమార్ (Rajeev Kumar)ను ఆ పదవి నుంచి తప్పించారు. ఇటీవల ముగిసిన ఇంగ్లండ్ పర్యటనలో భారత్ ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ను 2-2తో సమం చేసిన సమయంలోనూ రాజీవ్ కుమార్ సపోర్ట్ స్టాఫ్‌లో భాగంగా ఉన్నారు.
అయితే, తాజాగా అతడి కాంట్రాక్ట్ ముగియడంతో ఆయన స్థానంలో మరో మసాజర్‌ను సపోర్ట్ స్టాఫ్‌లోకి తీసుకున్నారు. అయితే, గౌతమ్ గంభీర్ హెడ్ కోచ్‌గా ఉన్న నాటి నుంచి బీసీసీఐ సపోర్ట్ స్టాఫ్‌లో పెద్ద ఎత్తున మార్పులు చేపడుతోంది. ఎవరైనా ఎక్కువ కాలం ప్రధాన జట్టుతో ఉండటం వల్ల ఫలితాలు తగ్గుతాయని బీసీసీఐ భావించిన నేపథ్యంలో ఈ మార్పుకు శ్రీకారం చుట్టినట్లుగా తెలుస్తోంది. ఇటీవలే బీసీసీఐ మాజీ అసిస్టెంట్ కోచ్ అభిషేక్ నాయర్ (Abhishek Nair), స్ట్రెంగ్త్ అండ్ కండిషనింగ్ కోచ్ సోహమ్ దేశాయ్‌లకు కూడా కాంట్రాక్ట్‌లు దక్కలేదు. తాజాగా టీమ్ మేనేజ్‌మెంట్ సిఫార్సు చేసిన కొత్త మసాజర్‌ను భారత జట్టు ఇప్పటికే నియమించినట్లుగా బీసీసీఐ ప్రకటించింది.






