- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
షాట్‌పుట్ ప్లేయర్ జాస్మిన్ కౌర్‌కు బిగ్ షాక్.. సస్పెన్షన్ వేటు వేసిన NADA
by Kema Shiva Kumar |
జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (NADA) సంచలన నిర్ణయం తీసుకుంది.

X
దిశ, వెబ్‌డెస్క్: జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (NADA) సంచలన నిర్ణయం తీసుకుంది. భారత ప్రముఖ షాట్‌పుట్ క్రీడాకారిణి జాస్మిన్ కౌర్ (Jasmine Kaur) డోపింగ్ పరీక్షలో విఫలం కావడంతో ఆమెపై సస్పెన్షన్ వేటు వేసింది. అయితే, ఇవాళ డోపింగ్ టెస్ట్‌లో విఫలమైన వారి జాబితాను NADA విడుదల చేయగా.. అందులో జాస్మిన్ కౌర్ పేరు ఉండటంతో క్రీడాభిమానులను విస్మయానికి గురి చేసింది. కాగా, 22 ఏళ్ల జాస్మిన్ కౌర్ ఇదే ఏడాది డెహ్రాడూన్‌లో జరిగిన క్రీడల్లో 15.97 మీటర్ల వ్యక్తిగత అత్యుత్తమ త్రోతో గోల్డ్ మెడల్ (Gold Medal) సాధించింది. పంజాబ్‌కు చెందిన జాస్మిన్ కౌర్ గతేడాది జరిగిన యూనివర్సిటీ లెవల్ పోటీల్లో 14.75 మీటర్ల త్రో చేసి సెకండ్ ప్లేస్‌లో నిలిచింది. జాస్మిన్ కౌర్ కాఫ్ సిరప్‌లలో ఉండే టెర్బుటాలినే అనే క్యాటలిస్ట్ వాడినట్లుగా డోపింగ్ టెస్ట్‌లో వెల్లడైంది.
Next Story






