ప్రపంచకప్‌ ఫైనల్‌లోనూ సత్తా చాటిన భద్రాచలం యువతి.. భారత్ టార్గెట్ ఎంతంటే?

by Gantepaka Srikanth |   (  Updated:2025-02-02 08:13:15  IST  )

అడర్-19 టీ20 మహిళల ప్రపంచ కప్‌(CC Under 19 Womens T20 World Cup 2025)లో భారత ప్లేయర్లు అదరగొట్టారు.

ప్రపంచకప్‌ ఫైనల్‌లోనూ సత్తా చాటిన భద్రాచలం యువతి.. భారత్ టార్గెట్ ఎంతంటే?
X

దిశ, వెబ్‌డెస్క్: అడర్-19 మహిళల టీ20 ప్రపంచ కప్‌(CC Under 19 Womens T20 World Cup 2025)లో భారత ప్లేయర్లు అదరగొట్టారు. మలేషియాలోని కౌలాలంపూర్ వేదికగా ఇవాళ సౌతాఫ్రికాతో ఫైనల్ మ్యాచ్ జరుగుతోంది. తుదిపోరులో టాస్‌ నెగ్గి బ్యాటింగ్‌ ఎంచుకున్న దక్షిణాఫ్రికా సరిగ్గా 20 ఓవర్లలో కేవలం 82 పరుగులకే కుప్పకూలింది. దీంతో అండర్ 19 టీ20 ప్రపంచ కప్‌ను నెగ్గేందుకు భారత్‌కు కేవలం 83 పరుగులు అవసరం. దక్షిణాఫ్రికా(South Africa) జట్టులో వాన్‌ వూరస్ట్ (23) టాప్‌ స్కోరర్. భారత బౌలర్లలో మరో భద్రాచలం(Bhadrachalam) యువతి గొంగిడి త్రిష సత్తా చాటింది. కీలక మ్యాచ్‌లో గొంగడి త్రిష మూడు వికెట్లు పడగొట్టింది. ఆమెతో పాటు వైష్టవి శర్మ 2, ఆయుషి శుక్లా 2, పరుణిక 2, షబ్నమ్ ఒక వికెట్ తీశారు. ఇప్పుడే భారత బ్యాటింగ్ మొదలైంది. కాసేపట్లో మన అమ్మాయిలు మరోసారి ఛాంపియన్‌గా నిలవబోతున్నారు.

భారత్: కమలిని (వికెట్ కీపర్), గొంగడి త్రిష, సనికా చల్కే, నికీ ప్రసాద్ (కెప్టెన్), ఐష్వరి, మిథిలా వినోద్, ఆయుషి శుక్లా, జోషిత వీజే, షబ్నమ్ షకిల్, పరుణిక సిసోదియా, వైష్ణవి శర్మ

దక్షిణాఫ్రికా: జెమ్మా బోథా, సిమోన్ లౌరెన్స్, డైరా రమ్లాకన్, ఫే కౌలింగ్‌, కౌలా రేనెకె (కెప్టెన్), కరాబో మెసో (వికెట్ కీపర్), మీకే వాన్ వూరస్ట్‌, సెష్నీ నాయుడు, ఆష్లే వాన్‌ విక్, మోనాలిసా లెగోడి, నిని

Next Story