IPL Final: ఆర్సీబీ వర్సెస్ పంజాబ్ మధ్య హైవోల్టేజ్ మ్యాచ్.. ఈ రాత్రికి చేతుల మారనున్న కోట్లరుపాయలు!

by Prasad Jukanti |   (  Updated:2025-06-03 12:06:43  IST  )

ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ సందర్భంగా భారీగా బెట్టింగ్ జరగబోతున్నట్లు తెలుస్తోంది.

IPL Final: ఆర్సీబీ వర్సెస్ పంజాబ్ మధ్య హైవోల్టేజ్ మ్యాచ్.. ఈ రాత్రికి చేతుల మారనున్న కోట్లరుపాయలు!
X

దిశ, డైనమిక్ బ్యూరో: మరికాసేపట్లో ఐపీఎల్ -2025 (IPL 2025) ఫైనల్ మ్యాచ్ లో భాగంగా ఆర్సీబీ (RCB) వర్సెస్ పంజాబ్ (Punjab) మధ్య మ్యాచ్ జరగబోతున్నది. తొలిసారి ట్రోఫీ గెలుచుకునేందుకు ఇరు జట్లు నువ్వా నేనా అన్నట్లుగా తలపడబోతున్నాయి. క్రికెట్ అభిమానులంతా ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ఈ మ్యాచ్ సందర్భంగా భారీగా బెట్టింగ్ (Betting) నడుస్తున్నట్లు తెలుస్తోంది. ఇరు జట్ల మధ్య హైవోల్టేజ్ మ్యాచ్ జరగబోతున్న ఈ నేపథ్యంలో ఈ రాత్రికి కోట్లాది రూపాయలు బెట్టింగ్ రూపంలో చేతులు మారబోతున్నట్లు పోలీసులు అంచనా వేస్తున్నారు. పబ్స్, రెస్టారెంట్లు, అపార్ట్ మెంట్లు, విల్లాల్లో పందాలు కాసే అవకాశం ఉండటంతో వాటిపై పోలీసులు నజర్ పెట్టారు మరో వైపు పోలీసులకు చిక్కకుండా బుకీలు ఆఫ్ లైన్ తో పాటు ఆన్ లైన్ లోను పెద్ద ఎత్తున బిజినెస్ చేసుకునేందుకు పావులు కదుపుతున్నారు. అలాగే ఆన్ లైన్ లో బెట్టింగ్ యాప్స్ లో జోరుగా దందా సాగుతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా మెట్రో నగరాల్లో కోట్లాది రూపాయాలు చేతులు మారే చాన్స్ ఉండటంతో టాస్క్ ఫోర్స్, ఎస్ఓటీ పోలీసులు పందెం రాయుళ్లపై ఫోకస్ పెట్టారు. బెట్టింగ్ యాప్ ద్వారా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. అత్యాశకు పోయి జీవితాలను నాశనం చేసుకోవద్దని సూచించారు.

Next Story