- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Betting Apps Pramotions Case : బెట్టింగ్ యాప్స్ కేసు.. హైకోర్టులో ఇమ్రాన్ పిటీషన్
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ కేసు(Betting Apps Pramotions Case) సంచలనం రేపుతున్న విషయం తెలిసిందే.

దిశ, వెబ్ డెస్క్ : ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ కేసు(Betting Apps Pramotions Case) సంచలనం రేపుతున్న విషయం తెలిసిందే. ఈ కేసులో ప్రముఖ నటులు, యాంకర్స్, యూట్యూబ్ ఇన్‌ఫ్లూయెన్సర్లపై పంజాగుట్ట పోలీసులు కేసులు నమోదు చేశారు. కాగా ఈ వ్యవహారంలో తనపై నమోదైన కేసును కొట్టివేయాలని పరేషాన్ బాయ్స్ ఇమ్రాన్ ఖాన్(Imran Khan) హైకోర్టు(High Court)లో గురువారం పిటిషన్ దాఖలు చేశాడు. తనపై పంజాగుట్ట పీఎస్‌లో నమోదైన ఎఫ్‌ఐఆర్‌ను కొట్టివేయాలని, పోలీసులవి నిరాధార ఆరోపణలు అని ఇమ్రాన్ ఫిర్యాదులో పేర్కొన్నాడు. పోలీసులు తనపై తదుపరి దర్యాప్తు చేపట్టకుండా స్టే ఇవ్వాలని కోర్టును కోరాడు. ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన హైకోర్ట్.. స్టే ఇవ్వడానికి నిరాకరించింది.
అదేవిధంగా ఈ కేసులో పోలీసుల విచారణకు హాజరై దర్యాప్తునకు సహకరించాలని ఇమ్రాన్‌కు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేసినందుకు గానూ విష్ణుప్రియ, సుప్రీత్, హర్ష సాయి, టేస్టీ తేజ, రీతు చౌదరితో సహా 25 మందిపై కేసు నమోదు చేశారు. ఇందులో ఇమ్రాన్ పేరు కూడా ఉంది. ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల యువత ఆర్థికంగా నష్టపోవడం, కొందరు ఆత్మహత్యలకు పాల్పడడం వంటి సంఘటనలు జరగడంతో పోలీసులు ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్నారు. దీనిలో భాగంగా చట్టవిరుద్ధంగా బెట్టింగ్ యాప్స్‌ను ప్రచారం చేసిన వారిపై తెలంగాణ గేమింగ్ యాక్ట్ మరియు ఐటీ యాక్ట్ కింద కేసులు బుక్ చేశారు.






