బెట్టింగ్‌ యాప్‌ వ్యవహారం.. రాబిన్‌ ఉతప్పకు ఈడీ నోటీసులు

by Kema Shiva Kumar |

ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్ కేసు (Betting App Case)కు సంబంధించి భారత మాజీ క్రికెటర్ రాబిన్ ఉతప్ప (Robin Uthappa)కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) ఇవాళ నోటీసులు​జారీ చేసింది.

బెట్టింగ్‌ యాప్‌ వ్యవహారం.. రాబిన్‌ ఉతప్పకు ఈడీ నోటీసులు
X

దిశ, వెబ్‌డెస్క్: ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్ కేసు (Betting App Case)కు సంబంధించి భారత మాజీ క్రికెటర్ రాబిన్ ఉతప్ప (Robin Uthappa)కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) ఇవాళ నోటీసులు​జారీ చేసింది. రాబిన్ ఉతప్ప సోషల్ మీడియా (Social Media)లో పలు బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేశాడని తేలడంతో ఈనెల 22న విచారణకు హాజరు కావాలని తాజాగా అతడికి అధికారుల నుంచి నోటీసులు అందాయి. చట్టవిరుద్ధమైన బెట్టింగ్ యాప్‌తో కేసు ముడిపడి ఉన్నందున మనీలాండరింగ్ నిరోధక చట్టం (PMLA) కింద ఈడీ రాబిన్ ఉతప్ప ఇచ్చే స్టేట్‌మెంట్‌ను ఈడీ రికార్డు చేయనుంది. కాగా, గత నెలలో మాజీ క్రికెటర్ సురేష్ రైనాతో పాటు శిఖర్ ధావన్‌ను కూడా ఇదే కేసులో ఈడీ ప్రశ్నించింది.

అయితే, 2024 డిసెంబర్ నెలలో క్రికెటర్ రాబిన్ ఉతప్పపై అరెస్ట్ వారెంట్ జారీ అయిన విషయం తెలినిందే. సెంటారస్ లైఫ్‌స్టైల్ బ్రాండ్స్ డైరెక్టర్‌గా ఉన్న ఆయనపై ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ (EPF) బకాయిలు చెల్లించనందుకు గాను రీజనల్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Next Story