- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆస్ట్రేలియాను ఓడించేందుకు ఇదే సరైన సమయం..ఒమన్ కెప్టెన్ వార్నింగ్
ఆస్ట్రేలియాను ఓడించేందుకు ఇదే సరైన సమయం అంటూ..ఒమన్ కెప్టెన్ జతీందర్ సింగ్ వార్నింగ్ ఇచ్చారు.

దిశ, వెబ్ డెస్క్: టీ20 వరల్డ్ కప్ 2026 లో ఆస్ట్రేలియా పరిస్థితి అత్యంత దారుణంగా తయారైంది. ఒకప్పుడు ఐసీసీ టైటిల్స్ అవలీలగా గెలిచిన ఆస్ట్రేలియా, ఇప్పుడు గ్రూప్ స్టేజ్ లోనే ఎలిమినేట్ కావాల్సిన పరిస్థితి నెలకొంది. టీ20 వరల్డ్ కప్ 2026లో జింబాబ్వే, శ్రీలంక లాంటి చిన్న జట్ల చేతిలో దారుణ ఓటమి చవిచూసింది ఆస్ట్రేలియా. ఈ నేపథ్యంలోనే గ్రూప్ స్టేజ్ లోనే ఎలిమినేట్ అయింది.
ఆస్ట్రేలియాకు వార్నింగ్ ఇచ్చిన ఒమన్ కెప్టెన్
టీ20 వరల్డ్ కప్ నేపథ్యంలో గ్రూప్ స్టేజ్ లో ఆస్ట్రేలియా నేడు చిట్ట చివరి మ్యాచ్ ఆడనుంది. ఒమన్, ఆస్ట్రేలియా మధ్య ఇవాళ లీగ్ దశలో చివరి మ్యాచ్ ఉంటుంది. శ్రీలంక వేదికగా రాత్రి 7 గంటలకు ఈ మ్యాచ్ ఉండనుంది. అయితే ఇప్పటికే ఈ రెండు జట్లు ఎలిమినేట్ కాగా.. కేవలం పరువు కోసం మాత్రమే ఆడుతున్నాయి. ఈ మ్యాచ్ ఆస్ట్రేలియాకు చాలా కీలకము. చివరి మ్యాచ్ అయినా గెలిచి పరువు నిలబెట్టుకోవాలని ఆస్ట్రేలియా భావిస్తోంది.
అయితే ఇలాంటి నేపథ్యంలో ఆస్ట్రేలియాకు డేంజర్ బెల్స్ పంపిస్తున్నారు ఒమన్ కెప్టెన్ జతీందర్ సింగ్. టీ20 వరల్డ్ కప్ 2026 లో ఎలిమినేట్ అయిన ఆస్ట్రేలియాను ఇప్పుడే దెబ్బ కొట్టాలని.. ఆ దిశగా తమ జట్టు అడుగులు వేస్తోందని హెచ్చరించారు జతీందర్ సింగ్. ఆస్ట్రేలియాను ఓడించేందుకు ఇదే అసలైన సమయం అంటూ వ్యాఖ్యానించారు. కచ్చితంగా ఓడించే దిశగా అడుగులు వేస్తామని వివరించారు. జింబాబ్వే, శ్రీలంక చేతిలో ఓడిపోయి ఒత్తిడిలోకి ఆస్ట్రేలియా వెళ్లిపోయిందని ఒమన్ కెప్టెన్ జతీందర్ సింగ్ వెల్లడించారు. ఆత్మవిశ్వాసం కోల్పోయిన ఆస్ట్రేలియాను ఇప్పుడే దెబ్బ కొట్టాలని పేర్కొన్నారు.






