- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సునీల్ ఛెత్రి టీంకు నో శాలరీ.. బెంగళూరు ఎఫ్‌సీ సంచలన నిర్ణయం!
సునీల్ ఛెత్రి టీంకు శాలరీ ఆపేయాలని బెంగళూరు ఎఫ్‌సీ సంచలన నిర్ణయం తీసుకుంది. ఐఎస్ఎల్ నిలిపివేయడంతోనే ఈ డెసిషన్ తీసుకున్నట్లు సమచాారం.

దిశ, స్పోర్ట్స్: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) నిలిపివేసిన నేపథ్యంలో బెంగళూరు ఫుట్‌బాల్ క్లబ్ కీలక నిర్ణయం తీసుకుంది. సునీల్ ఛెత్రి సహా తమ ప్లేయర్లు, సహాయక సిబ్బందికి జీతాలను నిలిపివేస్తున్నట్లు వెల్లడించింది. సోషల్ మీడియా వేదికగా బెంగళూరు ఎఫ్‌సీ ఈ విషయాన్ని తెలియజేసింది. లీగ్ నిర్వహణపై అనుమానాలు నెలకొన్న నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
అయితే ఇదే విషయంపై లీగ్‌లోని 8 ఫ్రాంచైజీల యజమానులు ఆలిండియా ఫుట్‌బాల్ ఫెడరేషన్ (ఏఐఎఫ్ఎఫ్) ఉన్నతాధికారులతో త్వరలోనే భేటీ అవనున్నారు. లీగ్‌ను ఎప్పుడు మొదలవుతుందో తెలియకపోవడంతో 8 క్లబ్బులు కూడా ఏఐఎఫ్ఎఫ్‌కు లేఖలు రాశాయి. ఈ క్రమంలో ఫ్రాంచైజీలతో ఆగస్టు 7న ఏఐఎఫ్ఎఫ్ ఉన్నతాధికారులు సమావేశం అవుతారని ఫుట్‌బాల్ ఫెడరేషన్ ప్రకటించింది.
కాగా, ఏఐఎఫ్ఎఫ్‌తో లీగ్ నిర్వాహకులు ఫుట్‌బాల్ స్పోర్ట్స్ డెవలప్‌మెంట్ లిమిటెడ్ చేసుకున్న మాస్టర్ రైట్స్ అగ్రిమెంట్ (ఎంఆర్ఏ)పై అసందిగ్ధత నేపథ్యంలో లీగ్‌ను నిలిపివేశారు. 15 ఏళ్ల కోసం ఏఐఎఫ్ఎఫ్, ఎఫ్‌ఎస్‌డీఎల్ చేసుకున్న ఎంఆర్ఏ డిసెంబరు 18న ముగియనుంది. దీనిపై తదుపరి నిర్ణయం తీసుకోవాల్సి ఉండటంతో లీగ్‌ను నిలిపివేశారు.






