గ్రౌండ్ లోనే సిరాజ్ ఎమోషనల్...ఇంగ్లాండ్ ప్లేయర్లు చేసిన పని చూస్తే!

by velandi.Saikiran |   (  Updated:2025-07-14 16:45:22  IST  )

లార్డ్స్ వేదికగా జరిగిన మూడవ టెస్ట్ మ్యాచ్ లో అద్భుతమైన విజయం సాధించింది ఇంగ్లాండ్. అదే సమయంలో గెలవాల్సిన

గ్రౌండ్ లోనే సిరాజ్ ఎమోషనల్...ఇంగ్లాండ్ ప్లేయర్లు చేసిన పని చూస్తే!
X

దిశ, వెబ్ డెస్క్: లార్డ్స్ వేదికగా జరిగిన మూడవ టెస్ట్ మ్యాచ్ లో అద్భుతమైన విజయం సాధించింది ఇంగ్లాండ్. అదే సమయంలో గెలవాల్సిన మ్యాచ్ ను చేజేతులా కోల్పోయింది టీమిండియా. ఈ మ్యాచ్ లో చివరి వరకు పోరాడిన టీమిండియా... 22 పరుగులు తేడాతో ఇంగ్లాండ్ చేతిలో ఓడిపోయింది. ఈ విజయంతో 2-1 తేడాతో ముందంజలోకి వెళ్ళింది ఇంగ్లాండ్. మరో రెండు టెస్టులు ఈ రెండు జట్ల మధ్య మిగిలి ఉన్నాయి.

అయితే టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య జరిగిన మూడవ టెస్టులో... మహమ్మద్ సిరాజ్ (Mohammad Siraj ) అలాగే రవీంద్ర జడేజా చివరి వరకు బ్యాటింగ్ చేశారు. కానీ స్పిన్నర్ బషీర్ వేసిన అద్భుతమైన బంతికి అవుట్ అయ్యాడు సిరాజ్. దీంతో ఇంగ్లాండ్ గెలిచింది. అయితే.. వికెట్ కోల్పోయిన తర్వాత గ్రౌండులోనే సిరాజ్ కాస్త ఎమోషనల్ అయ్యాడు. తనవల్లే టీమిండియా ఓడిపోయిందన్న బాధను... వెళ్లగక్కే ప్రయత్నం చేశాడు.

అయితే ఇలాంటి నేపథ్యంలోనే ప్రత్యర్థి జట్టు ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ (Ben Stokes), రూట్ ( Joe Root) ఇద్దరు మహమ్మద్ సిరాజ్ ను ఓదార్చారు. క్రికెట్ లో గెలుపు ఓటములు సహజమే అంటూ.. సిరాజ్ ను వెన్ను తట్టి.. ఓదార్చే ప్రయత్నం చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి.

Next Story