సుల్తాన్ అజ్లాన్ షా కప్‌లో భారత్‌కు షాకిచ్చిన బెల్జియం!

by Phanindra |

సుల్తాన్ అజ్లాన్ షా కప్‌లో భారత్‌కు బెల్జియం షాకిచ్చింది. ఉత్కంఠగా సాగిన మ్యాచులో 3-2తో భారత జట్టును ఓడించింది.

సుల్తాన్ అజ్లాన్ షా కప్‌లో భారత్‌కు షాకిచ్చిన బెల్జియం!
X

దిశ, స్పోర్ట్స్: సుల్తాన్ అజ్లాన్ షా కప్‌లో భారత హాకీ జట్టుకు బెల్జియం షాకిచ్చింది. మలేషియాలోని ఇపోలో మంగళవారం జరిగిన మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించింది. అనంతరం జరిగిన మ్యాచులో 2-3 తేడాతో బెల్జియం విజయం సాధించింది. భారత్ తరఫున అభిషేక్ (33వ నిమిషంలో), షీలానంద్ లక్రా (57వ నిమిషంలో) గోల్స్ చేశారు. బెల్జియం తరఫున రోమన్ డువెకట్ (17, 57వ నిమిషాల్లో) రెండు గోల్స్‌తో రాణించగా.. నికోలస్ డి కార్పెల్ (45వ నిమిషంలో) గోల్ చేశాడు. చివర్లో బెల్జియం మరో గోల్ చేసేలా కనిపించినా మోహిత్ అద్భుతమైన స్టాప్‌లో వారి అవకాశాన్ని అడ్డుకున్నాడు. కానీ మరో గోల్ చేసి స్కోర్లు సమం చేయాలనుకున్న భారత్ ఆశలు నెరవేరలేదు. తమ తొలి మ్యాచులో మూడు సార్లు ఛాంపియన్ అయిన సౌత్ కొరియాపై 1-0తో భారత్ గెలిచిన సంగతి తెలిసిందే. తమ తదుపరి మ్యాచులో బుధవారం నాడు మలేషియాను టీమిండియా ఢీకొట్టనుంది.

Next Story