క్రికెట్‌లో తీవ్ర విషాదం.. తేనెటీగల దాడిలో అంపైర్ మృతి

by Harish |

క్రికెట్‌లో  తీవ్ర విషాదం.. తేనెటీగల దాడిలో అంపైర్ మృతి
X

దిశ, స్పోర్ట్స్ : కాన్పూర్ క్రికెట్ అసోసియేషన్‌కు చెందిన అంపైర్ మణిక్ గుప్తా తేనెటీగల దాడిలో మరణించారు. ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో అండర్-13 క్రికెట్ మ్యాచ్ జరుగుతుండగా ఈ విషాదం చోటుచేసుకుంది. మ్యాచ్ రెండో ఇన్నింగ్స్ సమయంలో ఆకస్మాత్తుగా తేనెటీగల గుంపు దాడి చేసింది. ప్లేయర్లు, ప్రేక్షకులు పరుగులు తీశారు. కానీ, 65 ఏళ్ల మణిక్ గుప్తా తీవ్రంగా గాయపడ్డాడు. ఆయన శరీరంపై చాలా తేనెటీగలు కుట్టాయి. ఆయనను స్థానిక ఆస్పత్రికి తరలించగా పరిస్థితి విషమంగా ఉండటంతో మరో హాస్పిటిల్‌కు తరలించారు. కానీ, ఆయన చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మరణించినట్టు వైద్యులు తెలిపారు. మరో అంపైర్ జగదీశ్ శర్మతోపాటు పలువురు ప్లేయర్లు కూడా గాయపడినా పెద్దగా ప్రమాదం లేదని తెలుస్తోంది. కాన్పూర్ క్రికెట్ అసోసియేషన్‌తో గుప్తాకు 30 ఏళ్ల అనుబంధం ఉంది. చాలా మ్యాచ్‌లకు ఆయన అంపైర్‌గా వ్యవహరించారు.

Next Story