- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బీసీసీఐ సంచలన నిర్ణయం.. ఆసియా కప్‌కు టీమిండియా దూరం
పెహల్గాం టెర్రర్ అటాక్ నేపథ్యంలో బీసీసీఐ సంచలన నిర్ణయం తీసుకుంది.

దిశ, వెబ్‌డెస్క్: పెహల్గాం టెర్రర్ అటాక్ (Pahelgam Terror Attack) నేపథ్యంలో బీసీసీఐ (BCCI) మరో సంచలన నిర్ణయం తీసుకుంది. రాబోయే ఆసియా కప్ (Asia Cup)లో టీమిండియా (Team India) పాల్గొనబోవట్లేదని ప్రకటించింది. ఇదే విషయాన్ని బీసీసీఐ ఇవాళ ఆసియా క్రికెట్ కౌన్సిల్ (Asia Cricket Council)కు తెలిపింది. భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న వేళ ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే వచ్చే నెలలో జరిగే ఉమెన్స్ ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్ నుంచి తప్పుకుంటున్నట్లు బీసీసీఐ వెల్లడించి విషయం తెలిసిందే.
అదేవిధంగా పాకిస్తాన్ మంత్రి, పీసీబీ చైర్మన్ మోహ్సిన్ నఖ్వీ (Mohsin Naqvi) ప్రస్తుతం ఆసియా క్రికెట్ కౌన్సిల్ హెడ్‌గా బాధ్యతలు కొనసాగుతున్నారు. దీంతో శ్రీలంక వేదికగా జూన్‌లో జరిగే మహిళల ఆసియా కప్‌తో పాటు.. సెప్టెంబర్‌లో జరగబోయే పురుషుల ఆసియా కప్ నుంచి టీమిండియా తప్పుకుంటున్నట్లు బీసీసీఐ ACCకి సమాచారం అందజేసింది. పాక్‌ను క్రికెట్‌లోనూ ఏకాకి చేసే ప్రయత్నంలోనే బీసీసీఐ మరో అడుగు వేసింది. తాజా నిర్ణయంతో మెన్స్ ఆసియా కప్ ప్రశ్నార్థకంగా మారింది. ఒకవేళ టోర్నీ నుంచి టీమిండియా తప్పుకుంటే.. స్పాన్సర్స్ కూడా వెనక్కి వెళ్లే అవకాశం ఉంది.






