భారత టెస్టు కెప్టెన్‌గా గిల్.. అధికారికంగా ప్రకటించిన బీసీసీఐ

by Malleboina Mahesh |   (  Updated:2025-05-25 14:35:20  IST  )

భారత సీనియర్ ప్లేయర్, టెస్ట్ కెప్టెన్ రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించడంతో.. జట్టు కెప్టెన్ అనే ప్రశ్నలు తలెత్తాయి. జూన్ నెలలో ఇంగ్లాండ్‌తో టెస్ట్ టూర్ ఉండటంతో భారత జట్టు తదుపరి కెప్టెన్ ఎవరు అనే ప్రశ్నలు తలెత్తాయి.

భారత టెస్టు కెప్టెన్‌గా గిల్.. అధికారికంగా ప్రకటించిన బీసీసీఐ
X

దిశ, వెబ్‌డెస్క్: భారత సీనియర్ ప్లేయర్, టెస్ట్ కెప్టెన్ రోహిత్ శర్మ రిటైర్మెంట్ (Rohit Sharma's retirement) ప్రకటించడంతో.. జట్టు కెప్టెన్ అనే ప్రశ్నలు తలెత్తాయి. జూన్ నెలలో ఇంగ్లాండ్‌తో టెస్ట్ సిరీస్ ఉండటంతో భారత జట్టు తదుపరి కెప్టెన్ (Captain) ఎవరు అనే ప్రశ్నలు తలెత్తాయి. ఈ క్రమంలో యువ ప్లేయర్లు శుభ్‌మన్ గిల్(Shubhman Gill), రిషబ్ పంత్, బుమ్రా, కేఎల్‌లకు కెప్టెన్సీ బాధ్యతలు దక్కుతాయని జోరుగా చర్చ జరిగింది. ఈ క్రమంలో భారత టెస్టు క్రికెట్ జట్టు కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్‌ను బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (BCCI) అధికారికంగా ప్రకటించింది. ముంబైలోని BCCI ప్రధాన కార్యాలయంలో జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో సెలక్షన్ కమిటీ చీఫ్ (Chief of the Selection Committee) అజిత్ అగర్కర్ (Ajit Agarkar) ఈ ప్రకటన చేశారు.

ఈ నియామకం ఇంగ్లండ్‌తో 2025 జూన్ 20, నుంచి ప్రారంభమయ్యే ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ కోసం జరిగింది. ఈ ప్రకటనతో భారత టెస్ట్ కెప్టెన్ ఎవరు అనే ఉత్కంఠకు తెరపడింది. ఐపీఎల్ 2025లో గుజరాత్ టైటాన్స్ కెప్టెన్‌గా ఉన్న శుభ్‌మన్ గిల్.. మంచి ఫామ్‌లో ఉన్నాడు. అలాగే జట్టును నడిపించడంలో అతనికి రోహిత్, కోహ్లీ వంటి సీనియర్ ప్లేయర్ల నుంచి ఎంతో అనుభవం ఉంది. దీంతో పంత్, బుమ్రా, రాహుల్ కాకుండా ఇంగ్లాండ్ టూర్‌కు టెస్ట్ కెప్టెన్ గా గిల్ (Gill as Test captain) ను బీసీసీఐ (BCCI) ప్రకటించింది. అయితే కేవలం ఇంగ్లాండ్ టూర్‌కు మాత్రమే గిల్ కెప్టెన్ గా ఉంటాడా లేక మొత్తం భారత జట్టు టెస్ట్ కెప్టెన్ గా వ్వవహరిస్తాడా అనే విషయంలో క్లారిటీ రావాల్సి ఉంది. ఇదిలా ఉంటే మరికొద్ది రోజుల్లో జరగబోయే ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ కోసం బీసీసీఐ తుది జట్టును ప్రకటించింది.

ఇందులో రిషబ్ పంత్ కు వైస్ కెప్టెన్ గా బాధ్యతలు ఇచ్చింది. జట్టులో జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, అభిమన్యు ఈశ్వరన్, కరుణ్ నాయర్, నితీష్ కుమార్ రెడ్డి, రవీంద్ర జడేజా, ద్రువ్ జురేల్, వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ద్ కృష్ణ, ఆకాష్ దీప్, అర్షదీప్, కుల్దీప్ యాదవ్‌లకు చోటు దక్కింది.

Click For Tweet..

Next Story