- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సీనియర్లకు షాకిచ్చేలా బీసీసీఐ కొత్త నిబంధన?.. అమలుకు సిద్ధమవుతున్న బోర్డు?
భారత ఆటగాళ్లు దేశవాళీ క్రికెట్ ఆడాల్సిందేనని ఇటీవల బీసీసీఐ ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే.

దిశ, స్పోర్ట్స్ : భారత ఆటగాళ్లు దేశవాళీ క్రికెట్ ఆడాల్సిందేనని ఇటీవల బీసీసీఐ ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే భారత ఆటగాళ్ల సెంట్రల్ కాంట్రాక్ట్‌లో కొత్త నిబంధనను తీసుకురావాలని బోర్డు యోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఇటీవల వ్యక్తిగత కారణంతో రోహిత్ శర్మ పెర్త్ టెస్టుకు దూరంగా ఉన్న విషయం తెలిసిందే. అశ్విన్ అనూహ్యంగా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ మధ్యలో రిటైర్మెంట్ ప్రకటించాడు. గతంలో కోహ్లీ పలు మ్యాచ్‌లకు పలు కారణాలతో దూరంగా ఉన్నాడు. వీటిని దృష్టి పెట్టుకుని ప్లేయర్లు సరైన కారణం లేకుండా జాతీయ జట్టు బాధ్యతల నుంచి వైదొలగడాన్ని అరికట్టాలనే ఉద్దేశంతో బోర్డు కొత్త నిబంధనను తీసుకురావాలని చూస్తున్నట్టు తెలిసింది. కొత్త నిబంధన ప్రకారం.. సిరీస్ నుంచి తప్పుకోవాలంటే బలమైన మెడికల్, వ్యక్తిగత కారణం చెప్పాల్సి ఉంటుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఒకసారి ఆటగాడిని ఎంపిక చేశాక అనివార్యమైన అత్యవసర పరిస్థితి ఉంటే తప్ప అతను సిరీస్‌కు అందుబాటులో ఉండాల్సిందేనని పేర్కొన్నాయి. ఆటగాళ్ల నిర్ణయాలతో జట్టు ప్రణాళికలకు అంతరాయం కలుగుతుందని బోర్డు భావిస్తున్నది. ఈ నిబంధనపై బీసీసీఐ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.
- Tags
- #bcci






