- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నా భవిష్యత్తుపై బీసీసీఐదే నిర్ణయం.. నాకు పదవి ముఖ్యం కాదు: గౌతమ్ గంభీర్
దక్షిణాఫ్రికా చేతిలో టెస్ట్ సిరీస్‌లో భారత జట్టు ఘోర పరాజయం పాలైన విషయం తెలిసిందే.

దిశ, వెబ్ డెస్క్: దక్షిణాఫ్రికా చేతిలో టెస్ట్ సిరీస్‌లో భారత జట్టు ఘోర పరాజయం పాలైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ (Head coach Gautam Gambhir)ను పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ సోషల్ మీడియాలో భారీ ఎత్తున ట్రోల్స్, విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నెగిటివిటీ నేపథ్యంలో, గంభీర్ చేసిన వ్యాఖ్యలు క్రికెట్ వర్గాల్లో సంచలనం సృష్టించాయి. మ్యాచ్ అనంతరం నిర్వహించిన ప్రెస్ మీట్‌లో గంభీర్ మాట్లాడుతూ.. "నాకు పదవిలో కొనసాగడానికి అర్హత ఉందా లేదా అనేది బీసీసీఐ (BCCI) నిర్ణయిస్తుంది. నాకు భారత క్రికెట్ మాత్రమే ముఖ్యం, పదవి కాదు," అని గంభీర్ బలంగా చెప్పుకొచ్చాడు.
అలాగే జట్టు ఓటమికి కేవలం కోచ్‌గా తననే కాకుండా, ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలని ఆయన నొక్కి చెప్పారు. అంతేకాకుండా భారత జట్టు ఛాంపియన్స్ ట్రోఫీ, ఆసియా కప్‌లను గెలుచుకున్నప్పుడు కూడా తానే కోచ్‌గా ఉన్న విషయాన్ని గుర్తుచేసుకున్నారు. సోషల్ మీడియాలో తనపై జరుగుతున్న వ్యతిరేక ప్రచారాన్ని పక్కన పెట్టి, తాను భారత క్రికెట్ అభివృద్ధిపై మాత్రమే దృష్టి సారిస్తున్నట్లు చెప్పకనే చెప్పడం ద్వారా, గంభీర్ ఈ వివాదాన్ని మరింత పెంచాడు. గంభీర్ చేసిన ఈ వ్యాఖ్యలు విమర్శకులకు, ట్రోల్స్‌కు కౌంటర్‌గా విశ్లేషకులు బావిస్తున్నారు.






