రోహిత్, కోహ్లీని మిస్ అవుతున్నాం.. వారు లేని లోటు తెలుస్తోంది: రాజీవ్ శుక్లా

by Phanindra |

రోహిత్, కోహ్లీని మిస్ అవుతున్నామని, జట్టులో వారు లేని లోటు తెలుస్తోందని బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా అన్నాడు.

రోహిత్, కోహ్లీని మిస్ అవుతున్నాం.. వారు లేని లోటు తెలుస్తోంది: రాజీవ్ శుక్లా
X

దిశ, స్పోర్ట్స్: సీనియర్లు లేకుండా ఇంగ్లండ్‌లో అడుగు పెట్టిన టీమిండియాకు కఠినమైన సవాళ్లు ఎదురవుతున్నాయి. లార్డ్స్ టెస్టులో ఓడి 2-1తో భారత జట్టు వెనుకబడిన నేపథ్యంలో బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా కీలక వ్యాఖ్యలు చేశాడు. ఈ సిరీస్ ముందు రోహిత్, కోహ్లీ రిటైర్ అవడం గురించి మాట్లాడుతూ.. అది వారి వ్యక్తిగత అభిప్రాయమని, అయితే జట్టులో వాళ్లిద్దరూ లేని లోటు తెలుస్తోందని అన్నాడు.

‘మేమంతా రోహిత్, కోహ్లీ లేని లోటు ఫీలవుతున్నాం. అయితే రిటైర్ అవ్వాలన్న నిర్ణయం వారిదే. బీసీసీఐ పాలసీ ప్రకారం, మేం ఏ ఆటగాడినీ రిటైర్ అవ్వాలని అడగం’ అని శుక్లా స్పష్టంచేశాడు. వాళ్లిద్దరూ అద్భుతమైన బ్యాటర్లని, వారిని తామంతా మిస్ అవుతున్నామని చెప్పిన శుక్లా.. వన్డేల్లో వాళ్లు కొనసాగుతుండటం మంచి విషయమని చెప్పాడు.

అదే సమయంలో కుర్ర కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌ను మెచ్చుకున్న ఆయన.. ‘బ్యాటుతో కూడా గిల్ తన సత్తా నిరూపించుకున్నాడు. రెండు సెంచరీలు, ఒక డబుల్ సెంచరీతో చెలరేగాడు. ఇంతకన్నా గొప్పగా ఏముంటుంది?’ అని ప్రశ్నించాడు.

Next Story